Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్ స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన ధోని శిష్యుడు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సమాయత్తం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి

Arshdeep Singh Shatters Ruturaj Gaikwad Stumps
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సమాయత్తం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దేశవాళీ టోర్నీలో అదిరిపోయే ప్రదర్శన చేస్తూ తాను రేసులో ఉన్నానని అర్ష్‌దీప్ సింగ్ సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్ష్‌దీప్ కొత్త బంతితో చెలరేగుతున్నాడు.
స్వింగ్, రివర్స్ స్వింగ్‌తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. తాజాగా మహారాష్ట్రతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తొలి స్పెల్‌లోనే రెండు కీలక వికెట్లు తీశాడు. మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (5)తో పాటు సిద్దేశ్ వీర్‌ను తన వరుస ఓవర్లలో ఔట్ చేశాడు.
IND vs ENG : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. కేఎల్ రాహుల్ ఎంపిక పై బీసీసీఐ యూటర్న్..
ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాక్ ఇచ్చాడు. వరుసగా ఐదు బంతులను ఇన్ స్వింగర్‌గా వేశాడు. ఆఖరి బంతిని ఔట్ స్వింగర్ గా వేసి రుతురాజ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అర్ష్‌దీప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ 17.36 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు.
BBL 2025 : బిగ్‌బాష్ లీగ్‌లో అనుకోని ఘటన.. బంతి తగిలి సీగల్ మృతి
WHAT A SPELL BY ARSHDEEP SINGH 🥶
– Arshdeep gets Ruturaj in the Vijay Hazare Trophy Quarters.
Arshdeep is making a big case for Champions Trophy squad ⚡ pic.twitter.com/4R8DXPQvqF
— Johns. (@CricCrazyJohns) January 11, 2025