IND vs ENG : ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. కేఎల్ రాహుల్ ఎంపిక పై బీసీసీఐ యూటర్న్‌..

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న త‌రువాత భార‌త జ‌ట్టు మ‌రో సిరీస్‌కు సిద్ధం అవుతోంది.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. కేఎల్ రాహుల్ ఎంపిక పై బీసీసీఐ యూటర్న్‌..

BCCI U Turn On KL Rahul Selection In India Squad For England ODIs Report

Updated On : January 11, 2025 / 2:18 PM IST

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న త‌రువాత భార‌త జ‌ట్టు మ‌రో సిరీస్‌కు సిద్ధం అవుతోంది. ఇంగ్లాండ్‌తో టీ20, వ‌న్డే సిరీస్‌ల‌కు స‌మాయ‌త్తం అవుతోంది. జ‌న‌వ‌రి 22 నుంచి ఇంగ్లాండ్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. ఆ త‌రువాత‌ ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నుంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు టీమ్ఇండియా ఆడ‌నున్న చివ‌రి వ‌న్డే సిరీస్ ఇదే. ఈ క్ర‌మంలో దీన్ని స‌న్నాహాకంగా ఉప‌యోగించుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ సిరీస్ పై బీసీసీఐ ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా.. ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వాల‌ని సీనియ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ బీసీసీని విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. తొలుత దాన్ని అంగీక‌రించిన బీసీసీఐ ఆ త‌రువాత యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోకూడ‌ద‌ని బోర్డు భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

BBL 2025 : బిగ్‌బాష్ లీగ్‌లో అనుకోని ఘ‌ట‌న‌.. బంతి తగిలి సీగల్ మృతి

వాస్త‌వానికి ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి ఇవ్వాల‌ని సెల‌క్ష‌న్ క‌మిటీ భావించింది. అదే స‌మ‌యంలో రాహుల్ సైతం రెస్ట్ కావాల‌ని కోరాడు. అయితే.. ఇప్పుడు బీసీసీఐ పున‌రాలోచ‌న‌లో ప‌డింది. వ‌న్డే సిరీస్ ఆడాల్సిందిగా కేఎల్ రాహుల్‌ను కోరింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి మ్యాచ్ ప్రాక్టీస్ అయిన‌ట్లుగా ఉంటుంద‌ని వివ‌రించింది. మ‌రి ఇందుకు కేఎల్ రాహుల్ అంగీక‌రిస్తాడో లేదో చూడాలి. అని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు ముందుగా ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ జ‌న‌వ‌రి 22 నుంచి ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. అనంత‌రం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌లో ఆడిన జ‌ట్టే ఛాంఫియ‌న్స్ ట్రోఫీ బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. వ‌న్డేల్లో ఏకైక భార‌త మ‌హిళా ప్లేయ‌ర్‌గా..

ఇదిలా ఉంటే.. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి జ‌ట్టును ప్ర‌క‌టించేందుకు జ‌న‌వ‌రి 12 చివ‌రి తేదీగా ఐసీసీ తెలిపింది.