Maharashtra: పండుగ వేళ విషాదం.. తండ్రీకొడుకు ప్రాణాలు తీసిన స్మార్ట్ ఫోన్..

Maharashtra: మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్మార్ట్ ఫోన్ కారణంగా తండ్రీకొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Maharashtra: పండుగ వేళ విషాదం.. తండ్రీకొడుకు ప్రాణాలు తీసిన స్మార్ట్ ఫోన్..

Maharashtra tragedy Son And Father Suicide

Updated On : January 12, 2025 / 9:20 AM IST

Maharashtra: మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్మార్ట్ ఫోన్ కారణంగా తండ్రీకొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నాదేడ్ జిల్లాలోని మినాకీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రంలోని నాందేడ్ లో 16ఏళ్ల ఓంకార్ పదో తరగతి చదువుతున్నాడు. లాతూర్ జిల్లాలోని ఉద్దీర్ లోని హాస్టల్ లో చదువుకుంటున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు. అయితే, గత కొంతకాలంగా తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని తన తండ్రిని కోరుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన అతను మరోసారి తండ్రితో స్మార్ట్ ఫోన్ విషయంపై ప్రస్తావించాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో ఓంకార్ మనస్థాపానికిగురై తన పొలంలోని వెళ్లి చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఇది చూసిన తండ్రి.. అదే చెట్టుకు ఉరేసుకొని మరణించాడు. తండ్రీ, కొడుకు ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Also Read: Kondapochamma Sagar Reservoir Incident : కొండపోచమ్మ రిజర్వాయర్ దుర్ఘటన.. గల్లంతు కావడానికి ముందు యువకులు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాందేడ్ ఎస్పీ అభినాష్ కుమార్ మాట్లాడుతూ.. బాలుడి తల్లి వాంగ్మూలం ఆధారంగా ఈ ఘటనను ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ విషాద ఘటనపై బాలుడు తల్లి తెలిపిన వివరాల ప్రకారం..

ఓంకార్ కొంతకాలంగా సెల్ ఫోన్ కొనివ్వాలని తన తండ్రిని కోరుతున్నాడు. బుధవారం సాయంత్రం మరోసారి సెల్ ఫోన్ కావాలంటూ తండ్రిని కోరాడు. అయితే, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు, వాహనం కొనుగోలు కోసం చేసిన అప్పులు తీర్చాల్సి ఉందని, ఆ తరువాతనే ఫోన్ కొనిస్తానని ఓంకార్ కు తన తండ్రి చెప్పాడు. దీంతో అతను మనస్థాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పొలంలోకి వెళ్లి నిద్రపోతున్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ, మరుసటి రోజు ఉదయం కూడా ఇంటికి రాకపోవటంతో అతని కోసం తన తండ్రి, ఇద్దరు సోదరులు వెతుకులాట ప్రారంభించారు.

Also Read: China Conspiracy : చైనా నుంచి భారత్ కు భారీ ప్రమాదం పొంచి ఉందా? నీటితో యుద్ధానికి కాలు దువ్వుతోందా?

తండ్రి తొలుత పొలం వద్దకు వెళ్లి చూడగా ఓంకార్ చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. కొడుకు మృతి చెందడాన్ని తట్టుకోలేకపోయాడు. బాలుడు మృతదేహాన్ని కిందకు దించి అదే చెట్టుకు.. అదే ఉరితాడుకు తండ్రికూడా ఉరేసుకొని మరణించాడు. కుటుంబ సభ్యులు పొలంకు వెళ్లి చూడగా.. తండ్రీ కొడుకు ఇద్దరు మృతిచెంది కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదవశాత్తు మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.