Kondapochamma Sagar Reservoir Incident : కొండపోచమ్మ రిజర్వాయర్ దుర్ఘటన.. గల్లంతు కావడానికి ముందు యువకులు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్
విహార యాత్రకు వెళ్లొస్తామని ఇంట్లో చెప్పి వెళ్లిన యువకులు.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు

Kondapochamma Sagar Reservoir Incident : సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లను రప్పించాలని అధికారులు ఆదేశించారు సీఎం రేవంత్. జిల్లా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో ఈతకు వెళ్లి ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. మృతులు హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు.
విహార యాత్రకు వెళ్లొస్తామని ఇంట్లో చెప్పి వెళ్లిన యువకులు.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ లో అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. విహార యాత్ర ఐదుగురిని బలి తీసుకుంది. కాగా, దుర్ఘటన జరగడానికి ముందు ఆ యువకులు నీటిలో ఆటలు ఆడారు. ఎంతో సరదాగా గడిపారు. ఒకరిపై మరొకరు నీళ్లు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు.
మరో యువకుడు ఈ వీడియోను షూట్ చేశాడు. కాసేపట్లో తమలో ఐదుగురిని మృత్యువు కాటేయబోతోంది అనే విషయం తెలియని యువకులు ఆనందంతో కేరింతలు కొట్టారు. దుర్ఘటనకు ముందు యువకులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ ముషీరాబాద్ కు చెందిన యువకులు.. ఈత కోసం కొండపోచమ్మ రిజర్వాయర్ కు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో లోపలికి వెళ్లారు. నీటిలో కాసేపు ఆడుకున్నారు. వారు నీటిలో ఆడుతుండగా.. మరో యువకుడు వీడియో తీశాడు. ఈ క్రమంలో ఆరుగురు యువకులు నీటి గుంతలో పడిపోయారు. వారిలో ఒకరిని బయట వీడియో తీస్తున్న వ్యక్తి కాపాడాడు. అలా ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
ఈ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తో పాటు పోలీసులకు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్.
Also Read : చైనా నుంచి భారత్ కు భారీ ప్రమాదం పొంచి ఉందా? నీటితో యుద్ధానికి కాలు దువ్వుతోందా?