దారుణం :అప్పుడే పుట్టిన శిశివును బ్యాగ్ లో పెట్టి

సూరత్: ఏదో ఓ వస్తువును వదిలేసినట్లుగా అత్యంత అమానవీయంగా బిడ్నల్ని వదిలించుకుంటున్నారు. ఇది మాతృత్వానికే కాదు..మానవత్వానికే మాయని మచ్చ. కడుపున పుట్టిన బిడ్డ కేర్ మని ఏడిస్తే చాలు తల్లి గుండెలు తల్లడిల్లిపోతాయి. కానీ కడుపున పుట్టిన బిడ్డను వదలించుకుంటున్న తల్లులకు అమ్మతనం లేదనుకోవాలా? లేక మానవత్వమే లేదనేకోవాలా? వారి పరిస్థితులు కారణమనుకోవాలా? కారణం ఏదైనా అప్పుడే పుట్టిన పసికూనను నిర్ధాక్షిణ్యంగా వదిలించుకోవటం దారుణం. ఇదిగో ఇటువంటి ఘటనలు చాలానే వింటున్నాం..చూస్తున్నాం..కానీ ఓ నవజాత శివువులును బ్యాగ్ లో పెట్టి వదిలేసిన ఘటన గుజరాత్‌లోని జహంగీర్‌పూర్ లో చోటుచేసుకుంది.
సాయీ పూజన్ అపార్ట్‌మెంట్ వద్ద ఉన్న ఓ పెద్ద చెట్టు మొదట్లో అనుమానాస్పదంగా ఒక బ్యాగు కనిపించింది. దాన్ని తెరిచి చూడగా ఓ నవజాత శిశువు కనిపించింది. దీంతో 108కు ఫోన్ చేశారు స్థానికులు. సమాచారం అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకుని బ్యాగులోని శిశువుతో పాటు ఓ చీటీ చూడా బ్యాగులో ఉంది.
ఆ చీటీలో రోగి (బిడ్డను కన్న తల్లి) పేరు నిషా ఆర్ సోలంకీ అని రాసివుంది. మార్చి 22న జీవన్ రక్షా హాస్పిటల్ నుంచి 108 వాహనంలో ఒక గర్భవతిని తీసుకువెళ్లినట్లు..ప్రసవం తరువాత ఆ తల్లే తన బిడ్డను బ్యాగ్ లో పెట్టి వదలివెళ్లినట్లు 108కు చెందిన ఈఎంటీ అల్పేష్, డ్రైవర్ ఉదయ్ ఆ వివరాలను తెలిపినట్లుగా ఈ చీటీలో వివరాలు ఉన్నాయి. ఈ చీటీని స్వాధీనం చేసుకున్న 108 వాహనదారులు ఆ బిడ్డను సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.