ట్వీట్ దుమారం : కపిల్ మిశ్రాకు ఈసీ షాక్..

బీజేపీ లీడర్ కపిల్ మిశ్రాకు కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ న్యూస్ వినిపించింది. కొన్ని గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన నోటీసులను ఆయనకు పంపింది ఎన్నికల సంఘం. దీనికి కారణం కపిల్ మిశ్రా చేసిన ట్వీటే కారణం. దీనిపై ఆప్ నేతలు ఈసీకి కంప్లయింట్ చేశారు. అసలు కపిల్ మిశ్రా ఏమని ట్వీట్ చేశారు. ఈసీ అంతగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది ?
ఢిల్లీలో ఫిబ్రవరి 08వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. రెండోసారి అధికారంలోకి రావాలని ఆప్, ఇక్కడ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన నేతలు హోరాహోరీగా ప్రచారం కూడా నిర్వహించేస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికలను కపిల్ మిశ్రా భారత్ – పాక్‌తో పోల్చారంటూ ఆప్ నేతలకు ఈసీ తలుపు తట్టారు. ట్వీట్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని నిషేధం విధించింది. కపిల్ మిశ్రా 2020, జనవరి 23వ తేదీన ట్వీట్ చేశారు.
Read More : విజయసాయి ట్వీట్ : ఓపిక పట్టు ఉమా..మ్యావ్ మ్యావ్‌లు ఆపేయ్
మతపరమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, వెంటనే ట్వీట్‌ను తొలగించాల్సిందిగా ట్విట్టర్ యాజమాన్యానికి ఎన్నికల సంఘం సూచించింది. దీనిపై మిశ్రా రెస్పాండ్ అయ్యారు. తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, నిజం మాత్రమే మాట్లాడానని వెల్లడించారు. ఢిల్లీలో 8వ తేదీన అసెంబ్లీ ఫలితాలు జరుగనుండగా..అదే నెల 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
?????
??
????????8?? ????????
?????8 फरवरी को दिल्ली की सड़कों पर हिंदुस्तान और पाकिस्तान का मुकाबला होगा
— Kapil Mishra (@KapilMishra_IND) January 23, 2020