Eco friendly mask : వాడి పారేసిన మాస్కుల్లోంచి మొక్కలు

Eco friendly mask : వాడి పారేసిన మాస్కుల్లోంచి మొక్కలు

Eco Friendly Mask

Updated On : April 20, 2021 / 2:27 PM IST

eco friendly mask : దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారికి జనాలను హడలెత్తిస్తోంది. దీంతో ముఖానికి మాస్కులు పెట్టుకోవాల్సిందే..లేకుండా అంతే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. దీంతో కోవిడ్ పుణ్యమాని మాస్కుల వాడకం పెరిగిపోయింది. అలా ఎన్నో మాస్కులు వాడి పారేస్తున్నాం. దీంతో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోంది.మరి ఏం చేస్తాం చెప్పండీ..మాస్కులు తప్పనిసరి కదా..కానీ అలా ఓ యువకుడి ఆలోచనతో వాడి పారేసిన మాస్కుల వల్ల ఎటువంటి నష్టం జరగని మాస్కులు తయారు చేస్తున్నాడో యువకుడు. అతని తయారు చేసిన మాస్కులు వాడి పారేసిన తరువాత ఆ మాస్కుల్లోంచి మొలకలొస్తాయి. అవి మొక్కులవుతాయి. అదేంటీ మాస్కుల్లోంచి మొలకలా? అనుకుంటున్నారా? అదేమరి..‘ఎకో ఫ్రెండ్లీ’ మాస్కులు..

వాడి పారేసిన సర్జికల్‌ మాస్క్‌ ల వల్ల ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయం కనుగొన్నాడు కర్ణాటకకు చెందిన ఈ కుర్రాడు. అతని పేరు నితిన్ వ్యాస్. ‘ఎకో ఫ్రెండ్లీ’ మాస్క్‌ లను తయారుచేశాడు నితిన్. ఈ మాస్క్‌ లను వాడి పారేసినా ఎటువంటి సమస్యా ఉండదు. ఎందుకంటే ఆ మాస్కుల లోంచి కొద్దిరోజులకే మొలకలొస్తాయి. అవి మొక్కలవుతాయంటున్నాడు నితిన్. అదెలా అంటే కాటన్‌ క్లాత్‌ తో తయారుచేయబడిన ఈ మాస్క్ లో ఓ లేయర్‌ లో విత్తనాలు పెట్టాడు. పండ్లు, కూరగాయల విత్తనాలను మాస్కులోపల పెట్టి మాస్కులు తయారు చేస్తున్నాడు నితిన్.

వాటిని వాడేసిన తర్వాత పారేయకుండా భూమిలో పాతిపెడితే..వాటిల్లోంచి కొద్దిరోజుల్లోనే మొక్కలు వస్తాయంటున్నాడు నితిన్‌ వ్యాస్‌. కాటన్‌ తో తయారుచేసింది కాబట్టి తడపవద్దని చెబుతున్నాడు. సర్జికల్‌ మాస్క్‌ లాగా మెత్తగా ఉండదు కానీ ఈ ఎకో ఫ్రెండ్లీ మాస్క్‌ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలని సూచిస్తున్నాడు.