కర్నాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ ఆత్మహత్య

కర్నాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ ఆత్మహత్య

Updated On : December 29, 2020 / 10:43 AM IST

Karnataka Legislative Council Deputy Chairman suicide : కర్నాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మెగౌడ (64) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. చిక్ మంగుళూరులోని కాడూర్ దగ్గర ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహం అభ్యమైంది. మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ కూడా లభ్యం అయింది.

ఈ నెల 15 కర్నాటక శాసనమండలిలో గొడవ జరిగింది. ఆ సమయంలో ధర్మెగౌడతో కాంగ్రెస్ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారు. కుర్చీ నుంచి ఆయన్ను లాగేసి, చొక్కా చించేశారు. మొత్తానికి ఆత్మహత్యకు కారణం ఇదేనా లేదా వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న అంశంపై మరికొద్ది సేపట్లో క్లారిటీ రాబోతుంది.

అయితే శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ స్థాయి వ్యక్తి ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కర్నాటకలో సంచలనం కలిగించింది.