కర్ణాటకలో రెండు వారాల లాక్డౌన్

COVID-19 కేసుల పెరుగుదల కారణంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ మే 10 ఉదయం 6 గంటల నుండి మే 24 ఉదయం 6 గంటల వరకు ఉంటుందని శుక్రవారం

కర్ణాటకలో రెండు వారాల లాక్డౌన్

Lockdown Ka

Updated On : May 8, 2021 / 8:46 AM IST

Karnataka Lockdown : COVID-19 కేసుల పెరుగుదల కారణంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ మే 10 ఉదయం 6 గంటల నుండి మే 24 ఉదయం 6 గంటల వరకు ఉంటుందని శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో బిఎస్ యెడియరప్ప ప్రభుత్వం తెలిపింది. నిత్యావసర వస్తువులు,అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. కిరాణాసరుకులు విక్రయించే దుకాణాలు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

రహదారి మరమ్మతు పనులు, కార్గో వాహనాలు లాక్డౌన్ సమయంలో కొనసాగించడానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. షాపులు,హోటళ్ళు, పబ్బులు, బార్‌లు మూసివేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికే షెడ్యూల్ చేసిన విమానాలు మరియు రైళ్లు లాక్డౌన్ సమయంలో నడుస్తాయని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. ఇటీవలి రోజుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలుగా కేంద్రం గుర్తించిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 48,781 తాజా కేసులు నమోదయ్యాయి.