మైనింగ్ కింగ్ గాలి జనార్దర్ రెడ్డికి కరోనా

కర్ణాటక మైనింగ్ కింగ్, మాజీ బీజేపీ మంత్రి గాలి జనార్దర్ రెడ్డి(53)కి కరోనా వైరస్ సోకింది. స్వల్ప అనారోగ్యానికి గురై బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్న గాలి జనార్దన్ రెడ్డికి శనివారం రాత్రి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్దారించారు.
తనకు కరోనా లక్షణాలు ఏమాత్రం లేవని, అయినా పాజిటివ్ గా తేలిందని,డాక్టర్ల సలహామేరకు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నానని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న తన మిత్రులు, అభిమానులకు గాలి జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తన ప్రాణమిత్రుడు గాలి జనార్దర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు కర్ణాటక ఆరోగ్యమంత్రి శ్రీరాములు తెలిపారు. కాగా. ఆరోగ్యమంత్రి శ్రీరాములు తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం బళ్లారిలో మంత్రి శ్రీరాములు తల్లి పుణ్యతిథి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
తనకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటం వలన బళ్లారిలో మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంటిలో జరుగుతున్న ఆయన తల్లి పుణ్యతిథి కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని, ఇది తనను చాలా బాదిస్తోందని గాలి జనార్దన్ రెడ్డి ఆవేదన చెందుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.