జాతి వ్యతిరేకులకు బిర్యానీ కాదు.. బుల్లెట్ రుచిచూపాలి : కర్ణాటక మంత్రి
దేశ వ్యాప్తంగా సీఏఏను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ మంత్రులు, సీనియర్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశ వ్యాప్తంగా సీఏఏను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ మంత్రులు, సీనియర్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ వ్యాప్తంగా సీఏఏను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో బీజేపీ మంత్రులు, సీనియర్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతి విద్రోహులకు బిర్యానీ కాదు బుల్లెట్ రుచిచూపాలని అన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వైఖరికి తాను మద్దతిస్తానని తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్న ర్యాలీలో జాతి విద్రోహులను కాల్చిపారేయాలనే నినాదాలు మిన్నంటిన క్రమంలో ఈ వివాదంపై కర్ణాటక మంత్రి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది.
జాతి విద్రోహులపై అనురాగ్ ఠాకూర్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నవారిపై మంత్రి మండిపడ్డారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, యాకూబ్ మెనన్‌ల మృతిని వ్యతిరేకిస్తూ, తుక్డే తుక్డే గ్యాంగ్ ను సమర్థి స్తూ, సీఏఏపై దుష్ప్రచారం సాగిస్తున్నవారే అనురాగ్ ఠాకూర్ ప్రకటనతో విభేదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతి వ్యతిరేకులకు బిర్యానీ తినిపించడం కాదని, వారికి బుల్లెట్ రుచిచూపాలని మంత్రి రవి ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనురాగ్ ఠాకూర్ … సభకు వచ్చిన వారితో అనురాగ్ ఠాకూర్ నినాదాలు చేయించారు. దేశ్ కే గద్దారోం కో అని అనురాగ్ నినదిస్తే గోలీ మారో సాలోం కో… అని సభికులు ప్రతి నినాదం ఇచ్చారు. అయితే దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం…. అనురాగ్ ఠాకూర్‌కు నోటీసులు పంపించింది. జనవరి 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేనిపక్షంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది హెచ్చరించింది.