ముంబైలో కసబ్ బ్రిడ్జి : ఆ పేరు ఎలా వచ్చింది

ముంబై: కసబ్ అంటే మనకు గుర్తుకొచ్చే పేరు పాకిస్థాన్ ఉగ్రవాది అని. ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న పాకిస్థాన్ కరడు కట్టిన ఉగ్రవాది కసబ్. ఆపేరుతో ముంబైలో ఉండే వంతెన ఘోర ప్రమాదానికి గురైంది. పాక్ ఉగ్రవాదిపేరు ఆ బ్రిడ్జ్ కి ఎలా వచ్చిందో తెలుసుకుందాం..
కసబ్ బ్రిడ్జ్ కి ఆ పేరెలా వచ్చింది…
ముంబైలోని సీఎస్‌టీ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను ‘కసబ్ బ్రిడ్జి’గా వ్యవహరిస్తారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో అప్పటి నుంచి ఆ బ్రిడ్జికి ఆ పేరు స్థిరపడిపోయింది.
Read Also: కర్ణాటక మహిళా సాధ్వి మహాదేవి కన్నుమూత
7.30 గంటలకు కూలిన బ్రిడ్జ్
ప్రతీరోజు విధులు ముంగించుకున్న పలువురు ఉద్యోగులు, కార్మికులు ఈ వంతెనపై నుంచి ఇళ్లకు బయలుదేరుతుంటారు. ఈ క్రమంలోనే సరిగ్గా రాత్రి 7.30 గంటల సమయంలో వారు బ్రిడ్జిపై వెళ్తుండగా..వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో బ్రిడ్జ్ పైనుంచి నడుచుకుంటే వెళ్లేవారంతా అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. ఈ సందర్భంగా బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటికింద చిక్కుకుపోయారు. అంతేకాదు ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న పలువురు వ్యక్తులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు.
గురువారం మార్చి 14న జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకుని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందం గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సీఎం ఫడ్నవీస్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.