free WiFi: ప్రపంచంలోనే తొలి సారి ఢిల్లీ మొత్తం

free WiFi: ప్రపంచంలోనే తొలి సారి ఢిల్లీ మొత్తం

Updated On : December 20, 2019 / 5:58 AM IST

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటర్నెట్ సర్వీసుల్లో సంచలన ప్రకటన చేశారు. గురువారం ఫ్రీ వైఫై స్కీమ్ లాంచ్ చేయనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. పౌరసత్వ చట్ట సవరణ విషయంలో ఆందోళన చెలరేగుతుండటంతో అధికారులు ఇంటర్నెంట్ సేవలు నిలిపేశారు. కమ్యూనికేషన్ సమస్య ఉండకూడదని ఫ్రీ వైఫై స్కీమ్ ఆరంభిస్తున్నట్లు తెలిపారు. 

ఇంకా మాట్లాడుతూ.. ‘ప్రజల్లో 70శాతం మంది తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఎటువంటి సర్టిఫికేట్లు లేక భయపడుతున్నారు. ఇటువంటి చట్టాలు చేయడం మానేసి నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేయాలి. గురువారం నుంచి సిటిజన్‌షిప్ చట్టంపై ఆందోళనలు చెలరేగకూడదని ఇంటర్నెట్ సేవలు ఆపేశారు టెలికాం ఆపరేటర్లు’ 

‘ఢిల్లీ ఒకటే కాదు.. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయంటూ సంఘీభావం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. ఒక్క ముస్లింలకే కాదు. అందరిలోనూ ఆందోళన మొదలైంది. వారి పౌరసత్వాన్ని నిరూపించుకునేందుక సర్టిఫికేట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. 70శాతం మంది, నిరుపేదలు దేశంలో ఉండేందుకు ఆధారాలు లేవని వాపోతున్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని కేజ్రీవాల్ వెల్లడించారు. 

ఢిల్లీ ఒక్కటే ప్రపంచంలో ఫ్రీ వైఫై ఇచ్చిన తొలి నగరమని ఆయన అన్నారు. 11వేల హాట్ స్పాట్లను బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్లు, నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని వచ్చే ఆరు నెలల్లో మరో 100 ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.