కరోనాను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు

  • Published By: madhu ,Published On : April 2, 2020 / 09:37 AM IST
కరోనాను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు

Updated On : April 2, 2020 / 9:37 AM IST

కరోనా వైరస్ లక్షణాది మంది ప్రజలను బలి తీసుకొంటోంది. కానీ ఓ వృద్దుడిని ఏ మాత్రం చేయలేకపోయింది. 93 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు కోలుకున్నాడు. అంతేగాదు..ఆయన భార్య (88) ఆరోగ్యంగా ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ తెలిపారు. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు వందల సంఖ్యలో మరణిస్తున్న క్రమంలో..వీరిద్దరూ కోలుకోవడం ఊరటనిస్తోంది. 

చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి..భారతదేశంలోకి ప్రవేశించింది. తొలుత కేరళ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి పినరయి విజయన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అలాగే పథనంతిట్ట జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులకు కుమారుడున్నాడు.

ఇతను ఇటలీలో ఉంటున్నారు. ఇతను భార్య పిల్లలతో వృద్ధ దంపతుల నివాసానికి వచ్చారు. ఈ సమయంలో కరోనా మెల్లిమెల్లిగా విజృంభిస్తోంది. ఇది కాస్తా..వృద్ధ దంపతులకు సోకింది. మొత్తం ఏడుగురు వైరస్ బారిన పడ్డారు. వీరిని కొట్టాయం మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 

వృద్ధ దంపతులకు హృదయ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. వైద్యులు ఇచ్చిన సూచనలను తు.చ తప్పకుండా పాటించారు. క్రమం తప్పకుండా పాటించడంతో వీరు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. 

వైరస్ సోకినా..మానసికస్థైర్యం కోల్పోకుండా..వైరస్ ని జయించిన ఈ వృద్ధ దంపతులు అందరికీ స్పూర్తినిస్తున్నారు. వైద్యుల సలహాలు పాటిస్తే.. వ్యాధి వైద్యులు సూచిస్తున్నారు. ఏ మాత్రం వైరస్ కు సంబంధించిన లక్షణాలున్నా డాక్టర్స్ ని సంప్రదిస్తే చాలా బెటర్ అని తెలిపారు. 

Also Read | ప్రాణం పోదులే: క్రికెట్ లేకపోతే ఇంగ్లాండ్‌కు రూ.3వేల కోట్ల నష్టం