Kerala Bra Row : విద్యార్థినుల ”బ్రా”లు తొలగింపు వివాదం.. మహిళా కమిషన్ ఆగ్రహం

రూల్స్ పేరుతో కేరళలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినుల లోదుస్తులను (బ్రా) ఎగ్జామ్ సెంటర్ సెక్యూరిటీ సిబ్బంది విప్పించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్(NCW), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(NCPCR) సీరియస్ అయ్యాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని NCW చైర్ పర్సన్ రేఖా శర్మ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి లేఖ రాశారు.(Kerala Bra Row)

Kerala Bra Row : విద్యార్థినుల ”బ్రా”లు తొలగింపు వివాదం.. మహిళా కమిషన్ ఆగ్రహం

Neet Undergarments

Updated On : July 19, 2022 / 8:49 PM IST

Kerala Bra Row : రూల్స్ పేరుతో కేరళలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినుల లోదుస్తులను (బ్రా) ఎగ్జామ్ సెంటర్ సెక్యూరిటీ సిబ్బంది విప్పించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పరీక్షా కేంద్రం సిబ్బంది తీరుని అంతా తప్పుపడుతున్నారు. రూల్స్ పేరుతో అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్(NCW), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(NCPCR) సీరియస్ అయ్యాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని NCW చైర్ పర్సన్ రేఖా శర్మ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి లేఖ రాశారు. ఆరోపణలు నిజమని తేలితే.. నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీకి లేఖ రాశారు. వారిపై తీసుకున్న చర్యల గురించి 3 రోజుల్లో కమిషన్ కు నివేదించాలన్నారు.(Kerala Bra Row)

Adidas Bra Add : మహిళల న్యూడ్ ఫొటోలతో యాడ్.. నిషేధం విధింపు

సోమవారం నీట్ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కేరళలో ఈ ఎగ్జామ్‌కు సంబంధించి ఓ వివాదం వెలుగులోకి వచ్చింది. పరీక్షా కేంద్రం సిబ్బంది విద్యార్థినుల బ్రాలు తొలగించారు. కొల్లాం జిల్లాలో నీట్ పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లిన విద్యార్థినులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వారు ధరించిన బ్రాకు మెటల్ హుక్ ఉండటంతో.. ఆ లోదుస్తులను తొలగించాలని సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థినులను ఆదేశించారు. విద్యార్థినులు తిరస్కరిస్తే.. పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. కొల్లాం జిల్లాలోని మార్తోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థినులను సెక్యూరిటీ సిబ్బంది మెటల్ డిటెక్టర్ తో చెక్ చేశారు. మెటల్ డిటెక్టర్ బీప్ సౌండ్ చేయడంతో విద్యార్థినులను పక్కకు నిలిపారు. వారి బ్రాలకు మెటల్ పిన్ ఉండటంతో ఈ సౌండ్ వస్తోందని, వాటిని తొలగించాలని సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థినులపై ఒత్తిడి చేశారు. పరీక్షకు సమయం అవుతుండటంతో విద్యార్థినులు మరో దారి లేక సిబ్బంది చెప్పినట్లు బ్రా లు తొలగించారు. దీనిపై ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

NEET Undergarments : దారుణం.. అమ్మాయిల లోదుస్తులు విప్పించి పరీక్ష రాయించిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

‘సెక్యూరిటీ చెక్ తర్వాత నా కూతురు ధరించిన ఇన్నర్ వేర్‌కు ఉన్న హుక్‌ను మెటల్ డిటెక్టర్ గుర్తించిందని చెప్పారు. కాబట్టి, ఆ లోదుస్తును తొలగించాలని నా కూతురిని ఆదేశించారు. కేవలం నా కూతురే కాదు.. 90 శాతం మంది విద్యార్థినులు ఈ ఆదేశాల కారణంగా లోదుస్తులు తొలగించుకోవాల్సి వచ్చింది. వాటన్నింటిని స్టోర్ రూమ్‌లో పెట్టారు. ఈ పరిణామాలతో వారంతా మాసికంగా ఆందోళనకు గురయ్యారు. ఓ రూమ్‌లో మొత్తం ఇన్నర్ వేర్‌లను నా కూతురు చూసింది. ఈ మెంటల్ టార్చర్ కారణంగా చాలా మంది పిల్లలు ఏడుస్తూ కనిపించారు. చాలా మంది విద్యార్థినులు బ్రాలకు ఉన్న హుక్స్ తొలగించి కట్టేసుకున్నారు. ఈ చర్యతో పిల్లలు పరీక్ష కూడా కలవరంతోనే రాశారు’ అని ఓ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు సెక్యూరిటీ చెక్ పెద్ద సవాల్ గా మారింది. అభ్యర్థులు ఏ వస్తువులూ తమ వెంట తెచ్చుకోవద్దని ఆదేశాలు ఉన్నాయి. వాలెట్లు, హ్యాండ్ బ్యాగులు, బెల్ట్‌లు, క్యాప్‌లు, జువెలరీ, షూ, హీల్స్ వంటివన్నీ నిషేధాలే. అయితే, కొల్లాంలో మాత్రం రూల్స్ పేరుతో సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్ చేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి.