Kerala Covid Curfew : కేరళలో ఆదివారం లాక్‌డౌన్‌ ఎత్తివేత.. సాయంత్రం వరకు స్కూళ్లు, కాలేజీలు..

దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకూ కరోనా కేసులతో బిక్కుబిక్కుమని గడిపిన జనమంతా నెమ్మదిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.

Kerala Covid Curfew : కేరళలో ఆదివారం లాక్‌డౌన్‌ ఎత్తివేత.. సాయంత్రం వరకు స్కూళ్లు, కాలేజీలు..

Kerala Covid Curfew Kerala

Updated On : February 8, 2022 / 9:54 PM IST

Kerala Covid Curfew :  దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకూ కరోనా కేసులతో బిక్కుబిక్కుమని గడిపిన జనమంతా నెమ్మదిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. మరణాలు సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కేరళలో మొన్నటివరకూ కేరళ కేసులతో అల్లాడిపోయిన రాష్ట్రం.. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో విధించిన కరోనా ఆంక్షలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తోంది.

రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆదివారం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసింది. కేరళ ప్రభుత్వం మంగళవారం కోవిడ్ ఆంక్షలను మరింత సడలించింది. కోవిడ్ కేసుల పెరుగుదలతో విధించిన ఆదివారం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. ఇకపై అన్ని పాఠశాలలు, కాలేజీలు ప్రీ-కోవిడ్ షెడ్యూల్‌లో పనిచేయనున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయంత్రం వరకు తరగతులు కొనసాగించేందుకు అనుమతినిచ్చింది. కోవిడ్ అనంతర సమస్యలను గుర్తించడానికి చికిత్స అందించేందుకు పోస్ట్-కోవిడ్ రిజిస్ట్రీని నిర్వహించే అవకాశాన్ని కూడా ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది.

కోవిడ్ బాధితులపై ‘అనవసరమైన’ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కేరళలో రోజువారీ కోవిడ్ కేసులు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ఒక రోజు క్రితంతో పోలిస్తే.. రాష్ట్రంలో 29,471 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో కేరళలో కరోనా కేసుల సంఖ్య 63,23,378కి చేరింది. 824 మరణాలు నమోదయ్యాయి, దీంతో కేరళలో మొత్తం మరణాల సంఖ్య 59,939కి చేరింది.

మరోవైపు.. దేశంలో రోజువారీ క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. సోమవారం దేశంలో 67,597 క‌రోనా కేసులు నమోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం కోలుకున్న వారి సంఖ్య‌ 1,80,456గా నమోదైంది. క‌రోనా వ‌ల్ల‌ 1,188 మంది మృతి చెందారు.

ప్ర‌స్తుతం కరోనా బారిన పడిన వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్ల‌లో 9,94,891 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కరోనా మ‌ర‌ణాల సంఖ్య‌ 5,02,874కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 170,21,72,615 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు అందించారు.

Read Also : OTT Release: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!