Kerala Govt : రైతును చంపి తినేసిన పులిని చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు

రైతుపై దాడి చేసి చంపి తినేసిన పులిని చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Kerala Govt : రైతును చంపి తినేసిన పులిని చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు

Kerala tiger

Updated On : December 12, 2023 / 6:07 PM IST

Kerala Govt..Forest department : అరణ్యాలను వదిలి పులులు, చిరుతలు,ఎలుగు బంట్లు జనావాసాల్లోకి రావటం ఇటీవల బాగా పెరిగింది. అలా జనావాసాల్లోకి వచ్చే పులులు మనుషులపై దాడి చేయటం  జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో జంతువులు చేసిన దాడుల్లో మనుషులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అలా కేరళలో కొన్ని రోజుల క్రితం ఓ పులి జనావాసాల్లోకి వచ్చి ఓ రైతుపై దాడి చేసింది. దాడి చేసి శరీరాన్ని సంగం తినేసింది.దీంతో కేరళ ప్రభుత్వం ఆ పులిని పట్టుకోవాలని కుదరకపోతే..  చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కేరళలోని వయనాడ్  జిల్లాలో శనివారం (డిసెంబర్ 9,2023) ప్రజీష్ అనే 36 ఏళ్ల రైతులు పశువులకు గడ్డి కోసేందుకు వెళ్లగా అతనిపై ఓ పులి దాడి చేసింది. దాడి చేసి చంపేసి శరీరాన్ని సగం వరకు తినేసింది. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. తీవ్ర భయాందోళనలు రేపింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అప్పటి వరకు ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని తరలించవద్దని  డిమాండ్ వచ్చింది.

దీంతో ప్రభుత్వం స్పందించింది. ఆ పులిని పట్టుకోవాలని కుదరకపోతే చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ పులి మనుషులను చంపి తినే రకమా..? కాదా అనేది నిర్దారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మనుషుల్ని తినే రకమని నిర్ధారించబడితే చంపేయాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశించింది. ఆ పులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వివిధ ప్రాంతాల్లో 11 కెమెరాలు అమర్చారు. ఆ పులి ఆచూకీ కోసం యత్నిస్తున్నారు.