Kerala: అందుబాటులోకి కొబ్బరి కల్లు, బీరు.. పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా కేరళ సర్కార్ నిర్ణయాలు

కేరళ అందాలను చూస్తూ, అక్కడి రుచులను ఆస్వాదిస్తూ కొబ్బరి కల్లును ఎంజాయ్ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ సాయపడుతుంది అంటున్నారు అక్కడి హోటళ్ల యజమానులు.

Kerala: అందుబాటులోకి కొబ్బరి కల్లు, బీరు.. పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా కేరళ సర్కార్ నిర్ణయాలు

Kerala liquor policy

Updated On : July 31, 2023 / 1:55 PM IST

Kerala liquor policy: కేరళ సర్కార్ రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించే దిశగా లిక్కర్ పాలసీలో భారీగా మార్పులు చేసింది. ఓవైపు ఆదాయంతోపాటు మరోవైపు టూరిజం (Tourism) కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్యవిధానం, మద్యం దుకాణాల ఏర్పాటులో కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో, ఆయా సీజన్లలో లిక్కర్ అమ్మకాలు (liquor sales) పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు సిద్ధమైంది. అయితే అక్కడి సాంప్రదాయ కొబ్బరి కల్లు (Coconut Toddy)ను కూడా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది.

కేరళ అంటేనే ప్రకృతి రమణీయతకు పుట్టిల్లు అనేలా ఉంటుంది. కేరళ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజం. పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం పైనే కేరళ రాష్ట్ర సర్కార్ నడుస్తోంది. అందుకే కేరళలో టూరిజాన్ని మరింత ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. కేరళలో అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఇప్పటికే కొబ్బరి కల్లును అమ్ముకునే అవకాశం ఉంది. అయితే ఆ అమ్మకాలకు సంబంధించిన నిబంధనలు మరింత సడలించింది. రిసార్టులు, త్రీస్టార్, టూస్టార్ హోటళ్లలో కూడా కొబ్బరి కల్లుతోపాటు బీర్, వైన్ అమ్మకాలకు అనుమతి ఇచ్చింది.

కేరళ ఖజానాకు లాభం కలిగించడంతో పాటు కేరళ సంప్రదాయ పానీయం కొబ్బరి కల్లు కూడా పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా చిన్నచిన్న రెస్టారెంట్లు హోటళ్లలు కూడా అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో కోరుకున్న వారికి బీర్‌ కూడా అందించేందుకు అనుమతులు మంజూరు చేసింది. పర్యాటకులు ఎక్కువగా వచ్చే సీజన్‌లో ఇప్పుడున్న నిబంధనలు సడలిస్తూ కేరళ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

Also Read: కాచిగూడలో రెస్టారెంట్ ఆన్ వీల్స్.. వాకీ టాకీలో ఆర్డర్.. నోరూరించే రుచులు

అయితే చిన్నచిన్న రెస్టారెంట్లలో కొబ్బరి కల్లుతోపాటు బీర్లు, వైన్ అమ్మేందుకు అనుమతి ఇవ్వడంపై అక్కడి కొబ్బరి కల్లు దుకాణం యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయం దేశీయ మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా ఉంది కేవలం ఆదాయం కోసం మాత్రమే చూస్తున్నారని దీని వల్ల కొబ్బరి కల్లు అమ్మకాలకు నష్టం కలుతుందంటున్నారు. రాజకీయ నేతలు ఎన్నికలకు ముందు ప్రజలతో ఉంటామని చెప్పి గెలిచాక వ్యాపారస్తులకే వత్తాసు పలుకుతారని మండిపడుతున్నారు.

Also Read: కౌలాలంపూర్ నుంచి విమానంలో కొండచిలువలు తెచ్చిన ప్రయాణికుడు

అయితే పర్యాటకులు మాత్రం కేరళ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కేరళ అందాలను చూస్తూ, అక్కడి రుచులను ఆస్వాదిస్తూ కొబ్బరి కల్లును ఎంజాయ్ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ సాయపడుతుంది అంటున్నారు అక్కడి హోటళ్ల యజమానులు. కేరళ సంప్రదాయ పానీయానికి కూడా మంచి గుర్తింపు వస్తుందని చెబుతున్నారు. ఇది పర్యాటకరంగానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు.