Kerala Covid Cases : కేరళలో మళ్లీ కరోనా విజృంభణ..కొత్తగా 22,129 కేసులు
కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.

Covid Cases
Kerala Covid Cases కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో 22,129 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు,156మరణాలు నమోదైనట్లు మంగళవారం(జులై-27,2021)కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్త కోవిడ్ కేసుల్లో..116మంది హెల్త్ వర్కర్లు కూడా ఉన్నట్లు తెలిపింది. ఇందులో అత్యధిక మంది కన్నూర్ కి చెందినవారని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,79,130 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది. టెస్ట్ పాజిటివిటీ రేటు 12.35శాతంగా ఉందని తెలిపింది. అత్యధికంగా మలప్పురం జిల్లాలోనే 4037 కోవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక,గడిచిన 24 గంటల్లో 13,415మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని తెలిపింది.
ఇక,ఇప్పటివరకు మొత్తంగా కేరళలో నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 16,326కి చేరుకోగా..కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 31,43,043కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,371కి చేరింది