కరోనాపై కేరళ విజయం : యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారే ఎక్కువ

కరోనా వైరస్ (కొవిడ్-19) పోరాటంలో కేరళ కఠినమైన విధానాలను అమలు చేస్తోంది. భారతదేశంలో కరోనాపై కేరళ ప్రత్యేకమైన చర్యలను చేపడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో కరోనా లాంటి ఎన్నో మహమ్మారిలను ఎదుర్కొన్న కేరళ రాష్ట్రం కరోనా మహమ్మారిని సమర్థవంతంగా తరిమికొడుతోంది. కరోనాను కట్టడి చేయడంలో కేరళ వ్యూహాం ఫలించింది. కరోనాపై కేరళ విజయం సాధించింది. లేటెస్ట్ డేటా ప్రకారం.. కేరళలో ఇప్పుడు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిపోయింది. Covid-19 నుంచి కోలుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల కన్నా కోలుకున్నవారే ఎక్కువగా ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.
ఏప్రిల్ 15 నాటికి, కేరళలో మొత్తం కేసులు 387గా ఉండగా వాటిలో 167 యాక్టివ్‌గా ఉన్నాయి. 218మంది కరోనావైరస్ నుండి కోలుకున్నారు. బుధవారం నాటికి ఒక కొత్త కేసు మాత్రమే నమోదైంది. పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ రికవరీలను నమోదు చేయడం ఇది వరుసగా నాలుగవ రోజు. ఏప్రిల్ 13న యాక్టివ్ కేసుల సంఖ్య 178కి పడిపోయింది. మొత్తం రికవరీల సంఖ్య 198కి చేరింది. నిర్ధారించిన COVID-19 కేసులను నివేదించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం కేరళ. కరోనావైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఒక ట్వీట్‌లో కేరళ సాధించిన విజయాన్ని సూచించారు.
COVID-19 curve of Kerala has started to flatten. The active cases for the last one week has declined. The recovered cases (green curve) will cross the yellow curve soon.#COVID2019 #COVID pic.twitter.com/G9nja0UYCU
— Thomas Isaac (@drthomasisaac) April 12, 2020
ఏప్రిల్ 14న రాష్ట్రంలో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. కన్నూర్ నుండి నాలుగు, కోజికోడ్ నుండి 3, కాసరగోడ్ నుండి ఒకటి. అదే సమయంలో 13 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 173 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 211 మంది కోలుకున్నారు. అదే రోజు 81 మందిని వివిధ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేర్పించారు. 16,235 శాంపిల్స్ పరీక్ష కోసం పంపగా.. వాటిలో 15,488 నెగటీవ్ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,07,075 మందిని పర్యవేక్షిస్తున్నారు.
కేరళ విజయానికి రాష్ట్రం శాంపిల్స్ అవలంబిస్తోంది. COVID-19 పరిస్థితిని విజయవంతంగా నిర్వహించిన దేశాల నుండి ప్రేరణ పొందింది. కరోనావైరస్‌ను పరిష్కరించే విధానానికి దక్షిణ కొరియా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటోంది. దేశం తీసుకున్న చర్యలలో ఒకటి.. ఎవరైనా నడవగలిగే ఒక వాక్-ఇన్ COVID-19 టెస్టింగ్ బూత్‌ను ఏర్పాటు చేయడం, 10 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో వారు పరీక్షలు చేయించుకోవడం అక్కడి నుంచి నిష్ర్కమించడం వంటి చర్యలను చేపట్టింది.
#COVID19 Update | April 15, 2020
7 more have recovered.
Only 1 new case today. pic.twitter.com/3P6qEO0cwL
— CMO Kerala (@CMOKerala) April 15, 2020
కేరళకు చెందిన ఎర్నాకుళం జిల్లా యంత్రాంగం భారతదేశపు మొట్టమొదటి వాక్-ఇన్ కోవిడ్ -19 పరీక్షా సదుపాయాన్ని ప్రారంభించింది; COVID-19 కోసం పరీక్షించడానికి శాంపిల్స్ తీసుకునేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలను సురక్షితంగా ఉంచడానికి కాంటాక్ట్-ఫ్రీ వాక్-ఇన్ శాంపిల్ కియోస్క్ (WISK) ఏర్పాటు చేసింది.
న్యుమోనియా అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న COVID-19 రోగులకు నాలుగు ఔషధాల మిశ్రమాన్ని అందించింది. ఒక కేరళ ఆస్పత్రిలోనే రోగుల ప్రాణాలను రక్షించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని రుజువు అవుతోంది. దేశంలో ఏ రాష్ట్రానికిలేని అత్యధిక రికవరీ రేటు కేరళలో ఉంది. ప్రజల సహకారం కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. కేరళ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మెరుగైన విజయాల రేటు కోసం మరిన్ని రాష్ట్రాలు కేరళను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.