Supreme Court : కేరళ గవర్నరుకు వ్యతిరేకంగా సుప్రీం ఆశ్రయిస్తాం : సీఎం పినరయి విజయన్

కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరవయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం తెలిపారు....

Supreme Court : కేరళ గవర్నరుకు వ్యతిరేకంగా సుప్రీం ఆశ్రయిస్తాం : సీఎం పినరయి విజయన్

Kerala CM, Governor

Updated On : September 28, 2023 / 12:46 PM IST

Supreme Court : కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌ వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరవయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం తెలిపారు. (Kerala planning to approach Supreme Court against Governor) రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఎనిమిది బిల్లులపై గవర్నర్ సంతకం చేయలేదని విజయన్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 8 బిల్లులు గవర్నర్‌కు ఆమోదం కోసం సమర్పించారు. చాలా కాలం గడిచినా ఈ బిల్లులు చట్టంగా మారలేదని సీఎం విజయన్ చెప్పారు.

Ganesh Laddu Auction: వేలంలో రూ. కోటికిపైగా పలికిన గణేశ్ లడ్డూ.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

బిల్లులపై సంతకం చేయడంలో జాప్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంబంధిత మంత్రులు, అధికారులు గవర్నర్‌ను కలిసి ఆయన అడిగిన వివరణలు ఇచ్చారు. అయినప్పటికీ ఈ బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విజయన్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజత పతకం…వుషులో రోషిబినా దేవి కైవసం

ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో లేవనెత్తింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోందని, అక్కడ కేసును వాదించడానికి సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ సేవలను కూడా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని విజయన్ తెలిపారు.