Kerala Tea Stall Owner : భార్యతో ప్రపంచయాత్ర చేసే టీ స్టాల్ ఓనర్ కన్నుమూత
విదేశీ పర్యటనలతో గుర్తింపు సంపాదించుకున్న కేరళకు చెందిన టీ స్టాల్ యజమాని కేఆర్ విజయన్ (71) శుక్రవారం కన్నుమూశారు.

Kerala2
Kerala Tea Stall Owner: విదేశీ పర్యటనలతో గుర్తింపు సంపాదించుకున్న కేరళకు చెందిన టీ స్టాల్ యజమాని కేఆర్ విజయన్ (71) శుక్రవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా, విజయన్, ఆయన భార్య మోహన కేరళలోని ఎర్నాకులంల .. ‘శ్రీ బాలాజీ కాఫీ హౌస్’ ‘ పేరుతో ఓ టీస్టాల్ స్టాల్ నడిపుతున్నారు. అయితే విదేశీ పర్యటనలు చేయాలన్న ఆసక్తితో వచ్చిన ఆదాయంలో ప్రరి రోజు రూ.300 ఆదా చేసి, మరికొంత అప్పు తీసుకుని పలు దేశాలు సందర్శించారు. తొలిసారిగా 2007లో ఈ దంపతులు ఇజ్రాయెల్ వెళ్లారు. సోషల్ మీడియాలో వీరి గురించి వైరల్ అయిన తర్వాత అనేక మంది వీరికి ఫండింగ్ ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా 2019లో విజయన్ దంపతుల ఆస్ట్రేలియా ట్రిప్‌కు స్పాన్సర్ చేశారు.
గడిచిన 14ఏళ్లతో మొత్తం 26 దేశాలు చుట్టేశారు ఈ దంపతులు. ఇటీవలే రష్యా టూర్ కి వెళ్లొచ్చారు. ఏడాది అక్టోబరు 21-28 మధ్య రష్యాను సందర్శించారు. ఇదే వీరి చివరి విదేశీ ట్రిప్. ఇక,విజయన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.