Delhi High Court : వేరు కాపురం కోసం భర్తను సతాయిస్తున్న భార్యకు షాకిచ్చిన హైకోర్టు

అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం కాగానే తల్లిదండ్రులను వదిలేయటం పాశ్చాత్య దేశాల సంస్కృతి అని, దీన్ని భారతీయులు అనుసరించరు అంటూ ధర్మాసనం అభిప్రాయపడింది.

Delhi High Court : వేరు కాపురం కోసం భర్తను సతాయిస్తున్న భార్యకు షాకిచ్చిన హైకోర్టు

Delhi High Court

Updated On : August 24, 2023 / 1:38 PM IST

Delhi High Court : ఒకప్పుడు ఉండే ఉమ్మడి కాపురాలు ఇప్పుడు ఉండటంలేదు. కలిసి ఉందామనే ఆలోచనే గిట్టటంలేదు. ఇలా పెళ్లి కావటం అలా వేరు కాపురాలు పెట్టే పద్దతులు ఎప్పుడో మొదలై అవి కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటి తరం వారైతే ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండాల్సి రావటంతో ఇద్దరే ఉండటం వారికి పిల్లలు పుడితే వారిదో కుటుంబంగా మారిపోతోంది. ఇదిలా ఉంటే కలిసి ఉండే అవకాశం ఉన్నా కలిసి ఉండటానికి ఇష్టపడనివారు కూడా ఉన్నారు. అత్తమామలతో కలిసి ఉండటానికి కోడళ్లు ఇష్టపడటంలేదు. అటువంటి ఓ యువతి వేరు కాపురం గురించి భర్తపై ఒత్తిడి తెస్తోంది. అత్తామామలకు దూరంగా భర్తతో కలిసి ఉండాలని దాని కోసం వేరు పెట్టాలని భర్తపై ఒత్తిడి చేస్తున్న ఓ మహిళకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది.

అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ జంటకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సరైన కారణం లేకుండా అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పాశ్చాత్య దేశాల్లో జరిగినట్టుగా భారత్‌లో పెళ్లికాగానే కుమారుడు తన తల్లిదండ్రుల్ని విడిచి వేరుగా రావటం జరగదని పేర్కొంది. మేజర్‌కాగానే లేదా పెళ్లి కాగానే.. తల్లిదండ్రుల్ని వదిలేయటం పాశ్చాత్య దేశాల సంస్కృతి అని, దీన్ని భారతీయులు అనుసరించరు అంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. తల్లిదండ్రుల విషయంలో కుమారుడికి నైతికంగా, చట్టపరంగా కొన్ని బాధ్యతలుంటాయని, వృద్ధాప్యంలో వారి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ సురేష్ కుమార్ కైట్(Justice Suresh Kumar Kait), జస్టిస్ నీనా బన్సల్ కష్ణ(Justice Neena Bansal Kashna)తో కూడిన డివిజన్ బెంచ్ వెల్లడించింది..

Kullu Viral Video : కులూలో కుప్పకూలిన భవనాలు

కాగా 2002లో వివాహం జరిగిన ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆమెకు అత్తమామలతో కలిసి ఉండటం ఇష్టంలేదు. దీంతో వేరు కాపురం పెట్టాలని భర్తను పదే పదే అడిగింది. కానీ అతను ససేమిరా అంటూ తల్లిదండ్రులను వదిలి వేరే కాపురం పెట్టాటానికి ఇష్టపడలేదు. దీంతో ఆమె అత్తమామలు అధిక కట్నం తేవాలని తనపై ఒత్తిడి చేస్తున్నారు అంటూ ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్థానిక పోలీస్ స్టేషన్ ను సంప్రదించగా ఆమె పలుమార్లు కుటుంబంపై ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడైంది.

అత్తమామలు అధిక కట్నం కోసం వేధిస్తున్నారని..మామ తనపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపిస్తు భర్త కుటుంబంపై పలు ఆరోపణలు చేస్తు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. కానీ అవన్నీ అవాస్తవాలన్నట్లుగా భావించిన ఫ్యామిలీ కోర్టు కేసును కొట్టివేసింది. ఇలా భార్య వేధింపులు భరించలేక సదరు వ్యక్తి విడాకుల కోసం హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయ స్థానం ఆమె భర్త కుటుంబంపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోవటంతో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తు అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వం కిందకే వస్తుందని పేర్కొంది. అంతేకాదు ఇటువంటి ఆరోపణలు చేయటం మానసిక క్రూరత్వమని పేర్కొంది.