Kullu Viral Video : కులూలో కుప్పకూలిన భవనాలు

అందాల కులులో భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. కొండలపై అందంగా కనిపించే భవనాలు పేక మేడల్లా కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Kullu Viral Video : కులూలో కుప్పకూలిన భవనాలు

Himachal Pradesh

Updated On : August 24, 2023 / 1:04 PM IST

Buildings Collapsed in Kullu : హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ప్రముఖ పర్యాటక ప్రాంతం కులు (Kullu) బీతావహంగా మారింది. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు అందాల కులులో భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. కొండలపై అందంగా కనిపించే భవనాలు పేక మేడల్లా కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కులూలో కొండచరియలు విరిగిపడడంతో పలు ఇళ్లు కుప్పకూలాయి. పేకమేడల్లా కూలిపోవడం చూస్తుంటే అయ్యో అనిపిస్తోంది.

రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదలు ముంచెత్తడంతో వందాలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్లు బ్లాక్ అవుతున్నాయి. ఈక్రమంలో గురువారం (ఆగస్టు 24,2023)కులూలో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. కళ్లముందే కూలిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

Chandrayaan-3 : ‘సైకిల్ నుంచి చందమామ దాకా’ చంద్రయాన్ -3 సక్సెస్ వేళ .. వైరల్ అవుతున్న ఫోటో

పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో నివసించటం ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ ఏరియాలోని ప్రజలను రెండు రోజుల ముందే ఖాళీ చేయించినట్లు సమాచారం. కూలిపోయిన భవన శిథిలాల కింద ప్రమాదవశాత్తూ ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి.