Arvind Kejriwal: ఉత్తరాఖాండ్‌లో గెలిస్తే అమరుల కుటుంబానికి రూ.కోటి చొప్పున ఇస్తాం – కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇస్తామని వాగ్దానం చేశారు. 2022 ఉత్తరాఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే.. ప్రాణాలు కోల్పోయిన సెక్యూరిటీ పర్సనల్ కు..

Arvind Kejriwal: ఉత్తరాఖాండ్‌లో గెలిస్తే అమరుల కుటుంబానికి రూ.కోటి చొప్పున ఇస్తాం – కేజ్రీవాల్

Arvind Kejriwal

Updated On : January 3, 2022 / 6:45 PM IST

Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి ఇస్తామని వాగ్దానం చేశారు. 2022 ఉత్తరాఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే.. ప్రాణాలు కోల్పోయిన సెక్యూరిటీ పర్సనల్ కు రూ.కోటి చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రిటైర్డ్ ఆర్మీ జవాన్స్ 34-35 ఏళ్ల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు.

అలా ఉత్తరాఖాండ్ లో క్రమశిక్షణ, దేశభక్తి, మిలటరీ నైపుణ్యాలు పెంపొదిస్తామని అన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఉత్తరాఖాండ్ నవ నిర్మాణ్ ర్యాలీని అనౌన్స్ చేశారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా ‘ఆర్మీ, పోలీస్, పారామిలటరీ బలగాలల్లో అమరులైన వారి కుటుంబాలకు గౌరవ సూచకంగా రూ.1కోటి అందిస్తామని’ అన్నారు.

ఉత్తరాఖాండ్ లో అత్యధిక సంఖ్యలో ఆర్మీ కుటుంబాలు ఉన్నాయి. వాళ్లు చేయాలనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం చేజిక్కకుండా ఎవరూ ఆపలేరని అన్నారు కేజ్రీవాల్.

ఇది కూడా చదవండి : ప్రధాని మోదీతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ