Khalistani Terrorist Threat : ఇండియాకు వెళ్లిపోవాలంటూ కెనడాలోని భారతీయ హిందువులకు ఖలిస్థాన్ ఉగ్రవాది బెదిరింపు
ఖలిస్థాన్ అనుకూల సిక్కులు కెనడాకు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎప్పుడూ కెనడా వైపు ఉంటారని, ఎల్లప్పుడూ ఆ దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని సమర్థించారని తెలిపారు.

Khalistani terrorist Gurpatwant Singh Pannun
Khalistani Terrorist Threat Indian Hindus : ఇండియాకు వెళ్లిపోవాలంటూ కెనడాలోని భారతీయ హిందువులను ఖలిస్థాన్ ఉగ్రవాది బెదిరించాడు. కెనడా పట్ల, ఆ దేశ రాజ్యాంగం పట్ల విధేయతను భారతీయ హిందువులు తిరస్కరించారని నిషేధిత ఖలిస్థాన్ అనుకూల గ్రూప్, సిక్స్ ఫర్ జస్టిస్ నాయకుడు, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆరోపించాడు. ఖలిస్థాన్ అనుకూల సిక్కులు కెనడాకు ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే వారు ఎప్పుడూ కెనడా వైపు ఉంటారని, ఎల్లప్పుడూ ఆ దేశ చట్టాలు, రాజ్యాంగాన్ని సమర్థించారని తెలిపారు.
‘మీ గమ్యం భారత్. కెనడా వదిలి భారతదేశానికి వెళ్లండి’ అంటూ కెనడాలోని భారతీయ హిందువులను బెదిరించాడు. కాగా, జూన్ లో కెనడా భూ భాగంలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందని, నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆరోపించాడు. భారత్ ను రెచ్చగొట్టడం లేదన్నారు. నిజ్జర్ హత్యను అత్యంత తీవ్రంగా పరగణించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
Team India world cup jersey : టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ జెర్సీనీ చూశారా..? ఎలాగుందంటే..?
జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలతో కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్య అధికారులను బహిష్కరించాయి. మరోవైపు కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది. అలాగే కెనడాలోని భారతీయులు, విద్యార్థినులు, ఆ దేశానికి వెళ్లే పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.