CBI Raids : సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కాంలో కోల్‌కతా మేయరు ఇంటిపై సీబీఐ దాడులు
సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఇంటిపై సీబీఐ ఆదివారం దాడులు జరిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బృందం ఆదివారం ఉదయం దక్షిణ కోల్‌కతా హకీమ్ నివాసానికి చేరుకుంది. మేయరు ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి....

Kolkata Mayor Hakim
CBI Raids : సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఇంటిపై సీబీఐ ఆదివారం దాడులు జరిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బృందం ఆదివారం ఉదయం దక్షిణ కోల్‌కతా హకీమ్ నివాసానికి చేరుకుంది. మేయరు ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోల్ కత్తా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఈ ఏడాది ఏప్రిల్ 21వతేదీన ఆదేశించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దరఖాస్తు ఆధారంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read Also : Israel : ఇజ్రాయెల్ స్డెరోట్ పట్టణ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు
అయితే మున్సిపల్ కేసులను విచారించే అధికారం జస్టిస్ గంగోపాధ్యాయకు లేదని బెంగాల్ ప్రభుత్వం ఆరోపించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య పోరులో భాగంగా కేంద్రంలోని సర్కారు కేంద్ర సంస్థలతో టీఎంసీ నేతలపై పలు దాడులు చేయిస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసింది.
Read Also :Earthquakes : అప్ఘానిస్థాన్‌లో 8 సార్లు భూ ప్రకంపనలు.. 320 మంది మృతి