Tamil Nadu : ప్రముఖ నటుడు, స్టంట్ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆ వీడియో షేర్ చేసినందుకే..

కోలీవుడ్ స్టంట్ మాస్టర్, నటుడు కనల్ కన్నన్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పాస్టర్‌తో ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Tamil Nadu : ప్రముఖ నటుడు, స్టంట్ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆ వీడియో షేర్ చేసినందుకే..

Tamil Nadu

Updated On : July 11, 2023 / 11:00 AM IST

Tamil Nadu : కోలీవుడ్ స్ట్ంట్ మాస్టర్, నటుడు కనల్ కన్నన్‌ను నాగర్ కోయిల్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ కావడమే అందుకు కారణంగా తెలుస్తోంది.

Project K : ప్రాజెక్ట్ K టీష‌ర్టు అందుకున్న అమితాబ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

కనల్ కన్నన్ కోలీవుడ్‌లో స్టంట్ మాస్టర్‌గా, నటుడిగా మంచి పేరుంది. అయితే తాజాగా ఆయనను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. ఇంతకీ అతను చేసిన తప్పేంటంటే ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో (@kannan_kanal) షేర్ చేయడమే. ఆయన షేర్ చేసిన వీడియోలో ఒక పాస్టర్ మహిళతో డ్యాన్స్ చేస్తు కనిపించారు. ఈ వీడియో వెంటనే వైరల్ అయ్యింది.  ఈ వీడియోను సోషల్ మీడియాలో కనల్ కన్నన్ షేర్ చేసినందుకు అరెస్టు చేసినట్లు తమిళనాడు పోలీసులు పేర్కొన్నారు.

Salman Khan : స్టేజి పై సిగరెట్‌తో కనిపించిన సల్మాన్‌ఖాన్‌.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్.. పిక్ వైరల్!

కనల్ కన్నన్ వీడియోలో ‘ఇదీ విదేశీ మత సంస్కృతి యొక్క నిజమైన స్థితి? మారిన హిందువులారా.. పశ్చాత్తాపపడండి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతోనే కనల్ కన్నన్‌పై చర్యలు తీసుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.