India-China Clash: లధాఖ్ నుంచి అరుణాచల్ వరకు.. చైనాతో సరిహద్దును గరుడ దళంతో కట్టుదిట్టం చేసిన భారత్

2020 నుంచే సరిహద్దు వెంటన ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి చర్యలనైనా దూకుడుగా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్దంగా ఉంది. తాజాగా గరుడ బలగాల మోహరింపుతో సరిహద్దు మరింత పటిష్టమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక బలగాలకు ప్రత్యేక ఆయుధాల్ని సైతం సమకూర్చారట. అమెరికన్ సిగ్ సాయర్ అసాల్ట్ రైఫిల్స్‌తో పాటు సరికొత్త ఏకే-103 వంటి సరికొత్త ఆయుధాలను సమకూర్చారట.

India-China Clash: లధాఖ్ నుంచి అరుణాచల్ వరకు.. చైనాతో సరిహద్దును గరుడ దళంతో కట్టుదిట్టం చేసిన భారత్

Ladakh to Arunachal, IAF’s Garud commandos deployed

Updated On : December 22, 2022 / 5:35 PM IST

India-China Clash: చైనాతో ఉద్రిక్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. చైనా మూకల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు వెంట ప్రత్యేక శిక్షణ పొందిన వైమానిక గరుడ బలగాలను ఏర్పాటు చేసింది. లధాఖ్ నుంచి అరుణాల్ ప్రదేశ్ వరకు చైనా సరిహద్దు వెంబడి ఈ బలగాలను మోహరించింది. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లోనూ శత్రువును మట్టికరిపించే నైపుణ్యం గరుడ బలగాలకు ఉంటుంది.

Maharashtra: వీఐపీ సెక్యూరిటీకి నిర్భయ నిధులు.. అబ్బబ్బే, ఇది ఉద్ధవ్ సర్కార్ పనే అంటున్న ఫడ్నవీస్

2020 నుంచే సరిహద్దు వెంటన ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి చర్యలనైనా దూకుడుగా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్దంగా ఉంది. తాజాగా గరుడ బలగాల మోహరింపుతో సరిహద్దు మరింత పటిష్టమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక బలగాలకు ప్రత్యేక ఆయుధాల్ని సైతం సమకూర్చారట. అమెరికన్ సిగ్ సాయర్ అసాల్ట్ రైఫిల్స్‌తో పాటు సరికొత్త ఏకే-103 వంటి సరికొత్త ఆయుధాలను సమకూర్చారట.

Covid19: ఇండియాలో మళ్లీ లాక్‭డౌన్? క్లారిటీ ఇచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్

800-1000 మీటర్ల పరిధి నుంచి శత్రు సేనలను తరిమికొట్టగలిగే గలీల్ స్నిపర్ రైఫిల్స్‌తో పాటు నెగెవ్ లైట్ మెషిన్ గన్‌లు కూడా దళాల వద్ద ఉన్నాయి. జ్రాయెలీ టావర్ రైఫిల్స్‌తో పాటు సిగ్ సాయర్, ఎకె-సిరీస్ అసాల్ట్ రైఫిల్స్, వివిధ రకాలైన తాజా ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది.