August 15 : ఢిల్లీలో హై అలర్ట్, నలుగురు తీవ్రవాదులు అరెస్టు!

నలుగురు తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం మేరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లైంది. వీరి వద్దనుంచి 15 పిస్టోళ్లు, 50 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.

August 15 : ఢిల్లీలో హై అలర్ట్, నలుగురు తీవ్రవాదులు అరెస్టు!

India

Updated On : August 14, 2021 / 9:39 AM IST

Lashkar, Jaish Planning : దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఉగ్రవాదులు ఏదోరకంగా భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ప్రధానంగా టార్గెట్ చేస్తూ..దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2021, ఆగస్టు 14వ తేదీ శనివారం ఉగ్రమూకల కుట్రను భగ్నం చేశారు పోలీసులు.

Read More : India : వినేశ్ ఫొగాట్ షాకింగ్ స్టేట్‌మెంట్‌

మొత్తం నలుగురు తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం మేరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లైంది. వీరి వద్దనుంచి 15 పిస్టోళ్లు, 50 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.

Read More : Samantha: 3 గంటల్లో 10 లక్షల లైకులు.. ఇంతకీ ఈ ఫోటోలో ఏముందబ్బా?!

ఎర్రకోటతో సహా పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించాయి. ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆగస్టు 15వ తేదీన డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగరవేయడంపై నిషేధం విధించారు. యాంటీ డ్రోన్ల వ్యవస్థను పోలీసులు మోహరింప చేశారు.
మరోవైపు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవానికి దేశం మొత్తం సర్వం సిద్ధమౌతోంది. వజ్రోత్సవ వేడుకలను అంబరాన్నింటేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. భద్రతా విషయంలో కూడా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.