Srinagar Encounter : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..లష్కర్ టాప్ కమాండర్ తో పాటు మరో ఉగ్రవాది హతం
కశ్మీర్‌లోని శ్రీనగర్ సిటీ శివార్లలో ఇవాళ జరిగిన రెండు వేరువేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. హర్వాన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో.. లష్కరే తొయిబా(LeT)

Kashmir
Srinagar Encounter : కశ్మీర్‌లోని శ్రీనగర్ సిటీ శివార్లలో ఇవాళ జరిగిన రెండు వేరువేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. హర్వాన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో.. లష్కరే తొయిబా(LeT) టాప్ కమాండర్ సలీమ్ పర్రేను హతమార్చినట్టు కశ్మీర్ జోన్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
హర్వాన్కు సమీపంలోని గాసు గ్రామంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది మరణించినట్టు అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాది ఏ ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తి అన్న అంశాలపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ALSO READ Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్‌తో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ