Lata Khare: మారథాన్ గెలిచి భర్త ప్రాణాలు కాపాడిన 68ఏళ్ల మహిళ
68ఏళ్ల వయస్సులో భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు మారథాన్‌లో పాల్గొంది అనే విషయం మీకు తెలుసా.. మహారాష్ట్రాలోని చిన్న గ్రామంలోని లతా భగవాన్ ఖారె అనే మహిళ చాలా మంది యువతకు ఇన్‌స్పిరేషన్‌గా మారింది.

Marathon
Lata Khare: ప్రస్తుత జనరేషన్లో లవ్ లేదా ఇతర రిలేషన్ తాత్కాలిక సంబంధంగా చూస్తున్నాం. ఒక మహిళ 68ఏళ్ల వయస్సులో భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు మారథాన్‌లో పాల్గొంది అనే విషయం మీకు తెలుసా.. మహారాష్ట్రాలోని చిన్న గ్రామంలోని లతా భగవాన్ ఖారె అనే మహిళ చాలా మంది యువతకు ఇన్‌స్పిరేషన్‌గా మారింది.
భర్తతో కలిసి ఎన్నో కష్టాలు పడి జీవిస్తున్న వారికి పెద్ద కష్టం వచ్చిపడింది. రోజువారీ కూలీతోనే ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేసి కాయాకష్టంతో బతుకు గడుపుతున్నారు. సేవింగ్స్ ఏమీ లేకపోవడంతో ఆ గడ్డు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. పొలం నుంచి వచ్చాక ఓ రోజు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించింది.
లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లడంతో సీరియస్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. ఇంకా టెస్టులు చేయాలని.. బెటర్ ఫెసిలిటీ అందించాల్సిన అవసరం ఉందని ఏదైనా పెద్ద హాస్పిటల్ కు వెళ్లమని డాక్టర్లు చెప్పారు. భర్తకు ట్రీట్మెంట్ అందించడానికి డబ్బులు ఎలా ఏర్పాటు చేయాలో ఆమెకు తెలియలేదు. పొరుగువారిని, బంధువులను డబ్బుల కోసం అడిగింది.
ఎటువంటి ఆర్థిక సాయం అందకపోగా హాస్పిటల్ కు వెళ్లేంత డబ్బులు మాత్రమే చేతిలో ఉన్నాయి. భర్తను బారామతికి తీసుకెళ్లిన తర్వాత టెస్టులు నిర్వహించిన డాక్టర్లు ఇంకా చేయాల్సి ఉన్నాయని చెప్పారు. ఆమె శక్తికి మించిన పరీక్షలు చేయాలని వైద్యులు చెప్పారు. ఆశలన్నీ వదులుకున్న లతా.. దేవుడిపైనే నమ్మకం ఉంచింది.
ఇద్దరూ రోడ్ మీద ఆగి తినడానికి రెండు సమోసాలు కొనుక్కున్నారు. న్యూస్ పేపర్ లో చుట్టి ఆమె చేతికిచ్చాడు షాప్ వ్యక్తి.. అది తిని పేపర్ పారేయబోతుండగా పేపర్ పై ఉన్న పెద్ద హెడ్డింగ్ చూసింది లత. మారథాన్ లో పాల్గొంటే ప్రైజ్ మనీ వస్తుందని అందులో ఉంది. ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది.
అంతే మరుసటి రోజు అంతా స్పోర్ట్స్ షూస్, ట్రాక్ ప్యాంట్స్ తో పరుగు పందెంలో నిల్చొన్నారు. అదే వరుసలో లతా ఖారె కూడా చినిగిన చీరతో చెప్పుల్లేకుండా నిల్చొంది. కంటినిండా నీళ్లు తిరుగుతున్నాయి. అంతకుముందే ఆమెను పాల్గొనడానికి నిరాకరించిన నిర్వహకులతో గొడవకు దిగింది. గంటసేపు వాళ్లను బతిమాలి పందెంలో పాల్గొన్న ఆమె వాయు వేగంతో దూసుకెళ్లి చూసే వాళ్లను ఆశ్చర్యపరచడంతో పాటు మారథాన్ పూర్తి చేసింది.
నెలల కొద్దీ ఆ మారథాన్ లో పాల్గొనడానికి కష్టపడ్డ యువత మొత్తం అది చూసి ఆశ్చర్యపోయారు. ఒక మహిళ ఎక్కడి నుంచో వచ్చి అథ్లెట్లా పరిగెత్తి.. షాక్ ఇచ్చింది. లతా కాళ్ల నుంచి రక్తం కారడం మొదలైంది. చీర మొత్తం చెమటతో తడిచిపోయినా భర్త కోసం పరుగు ఆపలేదు.