People Data Leak : కోవిన్ పోర్టల్ ద్వారా ప్రజల డేటా లీక్.. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మరో కీలక ఆరోపణ

కోవిన్ డేటా లీక్ అయ్యిందని టీఎంసీ నేతలు సాకేత్ గోఖలే, డెరెక్ ఓబ్రెయిన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రముఖులు, జర్నలిస్టుల ప్రైవేట్ సమాచారం కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని ప్రతిపక్ష నేతలు ట్వీట్ చేశారు.

People Data Leak : కోవిన్ పోర్టల్ ద్వారా ప్రజల డేటా లీక్.. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మరో కీలక ఆరోపణ

people Data leak

Opposition Allegation Modi Govt : భారత ప్రజల డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మరో కీలక ఆరోపణ చేశాయి. కోవిన్ పోర్టల్ ద్వారా ప్రజల డేటా లీక్ అయ్యిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోవిన్ పోర్టల్‌ ద్వారా గోప్యతా ఉల్లంఘన జరిగిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. టీకాలు వేసిన వ్యక్తుల వ్యక్తిగత వివరాలు, వారి మొబైల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు, పాస్‌పోర్ట్ నెంబర్లు, ఓటరు ఐడీలు, కుటుంబ సభ్యుల వివరాలు లీక్ చేయబడ్డాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.

కాగా, కోవిన్ పోర్టల్ వ్యక్తిగత వివరాలైన పుట్టిన తేదీ, చిరునామాను సేకరించిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి యొక్క ఒక డోస్, రెండు డోస్‌లు, బూస్టర్ డోస్ స్వీకరించిన తేదీని మాత్రమే పోర్టల్ సేకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కోవిన్ డేటా లీక్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరణాత్మక నివేదిక సిద్ధం చేస్తోంది.

TS High Court : ‘ఇదో పబ్లిక్‌ న్యూసెన్స్‌’ పిటిషన్‌.. హరిరామ జోగయ్యపై టీఎస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

మరోవైపు కోవిన్ డేటా లీక్ అయ్యిందని టీఎంసీ నేతలు సాకేత్ గోఖలే, డెరెక్ ఓబ్రెయిన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రముఖులు, జర్నలిస్టుల ప్రైవేట్ సమాచారం కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని ప్రతిపక్ష నేతలు ట్వీట్ చేశారు.

కోవిడ్-19 వ్యాక్సినేషన్ పొందిన ప్రతి భారతీయుడి వ్యక్తిగత వివరాలు ఉచితంగా కోవిన్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్నాయని టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపించారు. మోదీ ప్రభుత్వం బలమైన డేటా భద్రతను అనుసరిస్తున్నట్లు చెప్పినప్పుడు పాస్‌పోర్ట్ నెంబర్, ఆధార్ నెంబర్ మొదలైన వ్యక్తిగత వివరాలు ఎలా లీక్ అయ్యాయని ప్రశ్నించారు.

Srihari Rao : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ అసంతృప్తి నేత శ్రీహరి రావు?

ఈ లీక్ గురించి హోం మంత్రిత్వ శాఖతో సహా మోదీ ప్రభుత్వానికి ఎందుకు తెలియదని నిలదీశారు. డేటా ఉల్లంఘన గురించి భారతీయులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని అడిగారు. ఆధార్, పాస్‌పోర్ట్ నెంబర్లతో సహా భారతీయుల సున్నితమైన వ్యక్తిగత డేటాకు ఎవరు యాక్సెస్ ఇచ్చారని సాకేత్ గోఖలే ప్రశ్నించారు.

డేటా లీక్ అంశంపై ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే ఆందోళన వ్యక్తం చేశారు. డేటా లీక్ అంశం నిజమైతే ఇది ఆమోదయోగ్యం కానిదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే తమకు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనకు పాల్పడిన వారిని బాధ్యులుగా నిర్ధారించాలని డిమాండ్ చేశారు.