Legendary poet : ప్రముఖ కవి జయంత మహాపాత్ర కన్నుమూత

ప్రముఖ కవి జయంత మహాపాత్ర ఆదివారం ఒడిశాలోని కటక్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 95. జయంత మహాపాత్ర మృతి పట్ల ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు....

Legendary poet : ప్రముఖ కవి జయంత మహాపాత్ర కన్నుమూత

Jayanta Mahapatra passes away

Updated On : August 28, 2023 / 6:20 AM IST

Legendary poet : ప్రముఖ కవి జయంత మహాపాత్ర ఆదివారం ఒడిశాలోని కటక్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 95. జయంత మహాపాత్ర మృతి పట్ల ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. (Legendary poet Jayanta Mahapatra passes away) జయంత మహాపాత్ర ఆంగ్ల కవిత్వానికి సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ కవి. అతనికి 2009వ సంవత్సరంలో ఆయనకు పద్మశ్రీ కూడా లభించింది. అయినప్పటికీ భారతదేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా 2015వ సంవత్సరంలో అతను దానిని తిరిగి కేంద్రప్రభుత్వానికి ఇచ్చారు.

Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు మరో బంగారుపతకం

న్యుమోనియా, ఇతర వృద్ధాప్య సంబంధిత వ్యాధుల చికిత్స కోసం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన మహాపాత్ర ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈయన ఇండియన్ సమ్మర్, హంగర్, 27 కవితల పుస్తకాలను రాశారు. మహాపాత్ర మరణించడం పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆంగ్లం మరియు ఒడియా సాహిత్యం రెండింటిలోనూ మహాపాత్రను మేధావిగా అభివర్ణించారు. సోమవారం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మహాపాత్ర అంత్యక్రియలు జరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సీఎం ఆకాంక్షించారు.