Leopard attack : జమ్ములో వ్యక్తిపై చిరుత దాడి
జమ్ములో చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసింది. గాంధీనగర్‌లోని గ్రీన్ బెల్ట్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Leopard Attack On A Man In Jammu
Leopard attack on a man : జమ్ములో చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసింది. గాంధీనగర్‌లోని గ్రీన్ బెల్ట్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్‌లో సంచరిస్తున్న చిరుతకు ఓ వ్యక్తి కంటపడ్డాడు. అంతే ఆ మనిషిపై లంఘించి పంజా విసిరింది.
చిరుత దాడిలో గాయపడ్డ ఆ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. చిరుతను పట్టుకునేందుకు అటవిశాఖ సిబ్బంది తీవ్ర యత్నం చేస్తోంది. పార్క్ ఆవరణలో పెద్దఎత్తున జనం గుమిగూడారు. కొన్ని రోజులుగా చిరుత ఇక్కడ సంచరిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇంతకు ముందు ఓ కుక్కను కూడా వేటాడి చంపింది.
చిరుత తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులులను పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది అన్ని యత్నాలు చేస్తోంది. అడవిలో బోనులు కూడా ఏర్పాటు చేసింది.