Madhya Pradesh: చేతిపంపు నుంచి నాటుసారా.. మద్యం మాఫియా అతి తెలివికి అవాక్కయిన పోలీసులు..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లా భన్‌పుర గ్రామంలో మద్యం డెన్‌పై పోలీసులు జరిపిన దాడిలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ చేతిపంపులో నీళ్లకు బదులు నాటుసారా రావటాన్ని పోలీసు బృందాలు గుర్తించి అవాక్కయ్యాయి.

Madhya Pradesh: చేతిపంపు నుంచి నాటుసారా.. మద్యం మాఫియా అతి తెలివికి అవాక్కయిన పోలీసులు..

Liquor

Updated On : October 13, 2022 / 8:01 AM IST

Madhya Pradesh: పోలీసులకు చిక్కకుండా నాటాసారా మాఫియా కొత్త ఎత్తుగడకు తెరతీసింది. చేతిపంపు కొడితే నాటుసారా వచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో పోలీసులు కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద అక్రమ నాటాసారా డెన్‌లపై పోలీసులు దాడులు జరపగా.. మాఫియా కొత్త ఎత్తుగడ వెలుగులోకి వచ్చింది.. మాఫియాదారుల తెలివితేటలకు పోలీసులుసైతం అవాక్కయ్యారు.

Somesh Kumar: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. ముగిసిన వీఆర్ఏల సమ్మె.. రేపట్నుంచి విధులకు హాజరు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లా భన్‌పుర అనే గ్రామంలో మద్యం డెన్‌పై పోలీసులు జరిపిన దాడిలో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ చేతిపంపులో నీళ్లకు బదులు నాటుసారా రావటాన్ని పోలీసు బృందాలు గుర్తించి అవాక్కయ్యాయి. నిందితులు తమ నివాసాలకు కొన్ని వందల మీటర్ల దూరంలో నాటుసారా డ్రమ్ములను భూమిలో పాతిపెట్టారు. వాటిపైన హ్యాండ్-పంప్‌ను అమర్చారు. అవసరం ఉన్నప్పుడల్లా ఈ హ్యాండ్ పంపుద్వారా నాటుసారాను క్యాన్ లలో నింపి చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పోలీసులు చేసిన ఈ దాడిలో మొత్తం 1200 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. అయితే, మాఫియా అతి తెలివితేటలతో నివ్వెరపోయిన పోలీసులు.. చుట్టుపక్కల గ్రామాల పరిధిలోని ప్రతీ ఇంటిలోనూ నాటుసారు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. డమ్ముల కొద్దీ నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.