సహజీవనం చేస్తున్న మహిళను కాల్చి రోడ్డుమీద పారేసిన ఎస్సై…రక్షించిన మరో పోలీసు

  • Published By: murthy ,Published On : September 28, 2020 / 11:53 AM IST
సహజీవనం చేస్తున్న మహిళను కాల్చి రోడ్డుమీద పారేసిన ఎస్సై…రక్షించిన మరో పోలీసు

Updated On : September 28, 2020 / 12:57 PM IST

live in relation woman: దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సైగా పని చేస్తున్న వ్యక్తి తన భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ఈ సమయంలో గత  సంవత్సర కాలంగా మరోక మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆవేశంలో రివాల్వర్ తో సహజీవనం చేస్తున్న మహిళపై కాల్పులు జరిపాడు. అదృష్ట వశాత్తు ఆ మహిళ గాయాలతో బయటపడింది.

ఢిల్లీలోని  లాహోర్ గేట్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సందీప్ దహియా భార్యతో విభేదాలు వచ్చి ఆమె నుంచి విడిపోయి దూరంగా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాది కాలంగా అతను మరోక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఆదివారం సెప్టెంబర్ 27 ఇద్దరూ సాయంత్రం వేళ కారులో బయటకు షికారుకు వెళ్లారు.



కారులో వెళుతుండగా వారిద్దరి మధ్య ఏదో విషయంలో వివాదం మొదలైంది. ఇద్దరూ వాదులాడుకోసాగారు. ఆవేశంలో సందీప్ గన్ తో ఆమెపై కాల్పులు జరిపి, కారులోంచి రోడ్డు మీద పడేసి వెళ్లిపోయాడు. అయితే అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న మరో సబ్ ఇన్ స్పెక్టర్ జవీర్ ఈ ఘటనను చూసి వెంటనే ఎలర్ట్ అయ్యాడు.



కింద పడి ప్రాణాపాయ స్ధితిలో ఉన్న ఆ మహిళను ఓ ప్రైవేట్ వాహనంలో ఎక్కించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళ కోలుకుంటోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్సై జవీర్ వెంటనే స్పందించబట్టి ఆమె బతికిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఎస్సై సందీప్ దహియా తనపై కాల్పులు జరిపినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.