Delhi blasts: నా జీవితంలో ఇంత పెద్ద శబ్దంతో పేలుడు ఎప్పుడూ వినలేదు.. అందరం చనిపోతామని అనిపించింది: ప్రత్యక్ష సాక్షి
"నా ఇంటి నుంచి మంటలు కనిపించాయి. ఏం జరిగిందో చూడటానికి కిందికి వచ్చాను. భారీ శబ్దం వినిపించింది. నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను" అని అన్నారు.
Delhi blasts: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద కారు పేలుడు సంభవించడంతో స్థానికులు వణికిపోయారు. పెద్ద శబ్దం రావడం, పలు వాహనాలకు మంటలు అంటుకోవడంతో స్థానికులు పరుగులు తీశారు.
రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నం.1 సమీపంలో జరిగిన పేలుడులో చాలా మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఒకరు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Breaking News: ఢిల్లీలో పేలుళ్లు.. 8 మంది మృతి.. అనేక మందికి గాయాలు
రాజధర్ పాండే అనే ఓ స్థానికుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. “నా ఇంటి నుంచి మంటలు కనిపించాయి. ఏం జరిగిందో చూడటానికి కిందికి వచ్చాను. భారీ శబ్దం వినిపించింది. నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను” అని అన్నారు.
స్థానిక వ్యాపారి మీడియాతో మాట్లాడుతూ.. “నా జీవితంలో ఇంత పెద్ద శబ్దంతో పేలుడు ఎప్పుడూ వినలేదు. ఆ పేలుడుతో నేను మూడు సార్లు కిందపడిపోయాను. మేమంతా ఇక చనిపోతామని నాకు అనిపించింది” అని తెలిపారు.
“ఒకరి చేతిని రోడ్డుపై చూశాను. మేమంతా షాక్ అయ్యాము. మాటల్లో వివరించలేను” అని మరో వ్యక్తి అన్నాడు.
