లోక్ సభ ఎన్నికలు : పూరి నుండి మోదీ పోటీ

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 05:55 AM IST
లోక్ సభ ఎన్నికలు : పూరి నుండి మోదీ పోటీ

ఢిల్లీ: 2019 ఎన్నికలలో బీజేపీ విజయం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటి నుండి పావులు కదుపుతున్నారు.  పార్టీ సభ్యుల గెలుపు వ్యూహంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పూరి లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.పార్టీ యూనిట్ పార్టీ పార్లమెంటరీ బోర్డు ముందు దీనికి సంబంధించిన ప్రతిపాదనను పెడతామని ఒడిషా యూనిట్ బసంత్ పాండా తెలిపారు. ఈ విషయంలో పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుందన్నారు బసంత్ పాండా. 

ఒడిశాలో రాజకీయ పరిస్థితిని మార్చడంతో పాటు బీజేడీని  ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. దీనికి సంబంధించిన బీజేపీ మిషన్ 120ను ప్రకటించింది. ఒడిషా అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ  ఎన్నికలు కూడా మే 2019 లో జరగనున్నాయి.వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అవకాశాలు గురించి సానుకూల సర్వే నివేదికల ద్వారా పొలిటికల్ విశ్లేషకులు మోడీ ఒడిషా నుండి పోటీ చేసి గెలుపొందటంతో  పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీకి మంచి సానుకూలత వస్తుందని బీజేపీ స్పోక్ పర్సెన్ గోలాక్ మొహాపాత్ర ఆశాభావం వ్యక్తం చేశారు. 

2014 లోక్ సభ ఎన్నికలలో పూరిలో బీజేపీ మూడవ స్థానంలో వున్నప్పటికీ..బీజేపీ అభ్యర్థి అశోక్ సాహు రెండు లక్షలకుపైగా ఓట్లను దక్కించుకోవటం విశేషం. ఈ ఎన్నికలల్లో బీజేడీ అభ్యర్థి పినాకి మిశ్రా 5,23,161 ఓట్లు గెలుచుకున్నారు. బీజేపీ అభ్యర్థికి 2,15,763 ఓట్లు లభించాయి. 

పూరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే ఉండగా..మిగిలిన ఆరు స్థానాల్లో బీజేడీ అభ్యర్థులు గెలిచారు. 21 లోక్ సభ స్థానాలకు ఒడిషాలో బీజేపీ 2014 ఎన్నికలలో సుందర్గర్ మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఒడిశాలోని పూరి నుండి పోటీ ద్వారా ఒడిశాలో బీజేపీ అధికారం దక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది.