Lok Sabha polls 2024: లోక్‌సభ ఎన్నికలు, దేశంలోని విపక్షాలను ఏకం చేయడమే లక్ష్యం.. నేడు, రేపు జేడీయూ కీలక సమావేశాలు

బిహార్ రాజధాని పట్నాలో నేడు, రేపు జేడీయూ నేతల సమావేశం జరగనుంది. వీటిలో దేశ రాజకీయాలు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడం వంటి అంశాలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ చర్చించనున్నారు. దేశంలోని జేడీయూ పదాధికారులు నేడు సమావేశంలో పాల్గొంటారు. అలాగే, రేపు పార్టీ నేషనల్ కౌన్సిల్ భేటీలో కూడా నితీశ్ కుమార్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ను నిన్న మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది.

Lok Sabha polls 2024: లోక్‌సభ ఎన్నికలు, దేశంలోని విపక్షాలను ఏకం చేయడమే లక్ష్యం.. నేడు, రేపు జేడీయూ కీలక సమావేశాలు

Lok Sabha polls 2024

Updated On : September 3, 2022 / 11:02 AM IST

Lok Sabha polls 2024: బిహార్ రాజధాని పట్నాలో నేడు, రేపు జేడీయూ నేతల సమావేశం జరగనుంది. వీటిలో దేశ రాజకీయాలు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడం వంటి అంశాలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ చర్చించనున్నారు. దేశంలోని జేడీయూ పదాధికారులు నేడు సమావేశంలో పాల్గొంటారు. అలాగే, రేపు పార్టీ నేషనల్ కౌన్సిల్ భేటీలో కూడా నితీశ్ కుమార్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ను నిన్న మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసింది.

ప్రతిపక్షాల తరఫున దేశ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడతారా? అన్న ప్రశ్నలు అడిగింది. అయితే, ఇటువంటి ప్రశ్నలు అడిగి తనను ఇబ్బంది పెట్టవద్దని నితీశ్ కుమార్ కోరారు. అయితే, జేడీయూ కార్యాలయాల ముందు పెట్టిన పలు పోస్టర్లలో నితీశ్ కుమార్ ను జాతీయ నేతగా అభివర్ణించారు.

‘‘రాష్ట్రంలో నిరూపించుకున్నారు.. ఇక ఆయనను దేశం చూస్తుంది.. ఆట ప్రారంభమైంది.. మార్పు ప్రారంభం కానుంది’’ అని పోస్టర్లలో పేర్కొన్నారు. నేడు, రేపు జరగనున్న జేడీయూ సమావేశాల్లో జాతీయ రాజకీయాలపై చర్చిస్తామని, పార్టీ రూట్ మ్యాప్ ను ఖరారు చేస్తామని ఆ పార్టీ నేతలు అన్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో నితీశ్ కుమార్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. జేడీయూ సమావేశంలో భాగంగా.. దేశంలో పెరిగిపోతోన్న ధరలు, నిరుద్యోగంపై కూడా చర్చించనున్నారు.

Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం