రెండేళ్ల మర్డర్ మిస్టరీ : అమ్మాయి కోసం స్నేహితుడ్ని చంపేసి

హైదరాబాద్: సృష్టిలో తియ్యనిది స్నేహం అంటారు. ఆ స్నేహానికే కళకం తెచ్చి..అనుమానం పెనుభూతంగా మారి స్నేహితుడ్ని అంతం చేసేసింది. బతుకు తెరువు కోసం కన్నవారిని విడిచి ఢిల్లీకి వెళ్లి జీవితంలో స్థిరపడే సమయంలో స్నేహితుడ్ని దారుణంగా హత్య చేసి తన జీవితాన్ని కూడా నాశనం చేసుకున్న ఘటన స్నేహినికే కళకం తెచ్చింది.
రెండేళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ వీడిండి. మిస్సింగ్ కేసుతో మొదలై హత్య కేసుగా వెలుగులోకొచ్చింది. బంధువులు, స్నేహితులు అయిన మెదక్‌కు చెందిన 27ఏళ్ల జయప్రకాశ్, 30 ఏళ్ల విజయ్‌కుమార్ ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లారు. దాబ్రీ ప్రాంతంలో ఉన్న చాణక్యప్లేస్‌లో విక్రమ్‌సింగ్ అనే వ్యక్తికి చెందిన అపార్ట్‌మెంట్‌లో ఒకే రూమ్ అద్దెకు తీసుకుని ఉద్యోగ వేట పడగా కొంతకాలానికి ఇద్దరికి ఉద్యోగాలు దొరికాయి.
ఈ క్రమంలో విజయ్ ఓ అమ్మాయితో ప్రేమలో పడటం..ఆ అమ్మాయి విషయాలు..ఆఫీస్ విషయాలు అన్నీ జయప్రకాశ్ తో షేర్ చేసుకునేవాడు. లవర్ ని జయప్రకాశ్ కు పరిచయం చేయటం…ప్రకాశ్ కూడా ఆ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతుండటంతో తన గురించి తన లవర్ కు జయప్రకాశ్ చెడుగా చెబుతున్నాడనే అనుమానం పెంచుకున్న విజయ్ జయప్రకాశ్ ను చంపి పెద్ద పూల తొట్టెలో పాతి పెట్టేసి ఏమీ తెలియనట్లుగా నా స్నేహితుడు జయప్రశాశ్ కనపించట్లేదంటు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏమీ తెలియనట్లు రూమ్ ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేశాడు. విజయ్ రూమ్ ఖాళీ చేసి వచ్చేసిన తరువాత ఇంటి యజమాని మరికొందరు అద్దెకు అద్దెకివ్వగా వారు కూడా ఖాళీ చేసి వెళ్లిపోయిన తరువా అక్టోబర్ 8న ఆ రూమ్ కు రిపేర్స్ చేయటంలో భాగంగా పూలకుండీలను తొలగిస్తుండగా ఓ అస్థిపంజరం బయటపడటంతో విక్రమ్‌సింగ్ పోలీసులకు అక్టోబర్ 9న కంప్లైంట్ చేశాడు. ఘటనాస్థికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ రూమ్ లో గతంలో అద్దెకువున్నవారి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా అస్థిపంజరం డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. నమూనాలు సేకరించిన పోలీసులు..జయప్రకాశ్ మిస్సింగ్ కేసుపై అనుమానాలున్న పోలీసులు మెదక్ నుంచి జయప్రకాశ్ కుటుంబీకుల్ని రప్పించి వారి డీఎన్ ఏలను కూడా తీసుకుని టెస్ట్ చేయటం.. రెండూ డీఎన్‌ఏలను ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ లు అస్థిపంజరం జయప్రకాశ్‌దేనంటూ నిర్ధారించారు.
డీఎన్ఏలు మ్యాచ్ రిపోర్ట్ రావటంతో..
ఈ క్రమంలో విజయ్ ను నిందితుడిగా అనుమానించిన ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి..నగరానికి వచ్చిన జనవరి 11న విజయ్ ను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. పోలీసుల విచారణలో హత్యకు కారణాలంటినీ విజయ్ బయటపెట్టటంతో రెండేళ్ల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదైన హత్య కేసు 2019లో జరిగిన ఈ హత్య మిస్టరీ కేసు వీడింది.
ఫ్యాన్ మోటార్‌తో హత్య…
జయప్రకాశ్ పై అనుమానంతో అదను కోసం ఎదురు చూసిన విజయ్ 2016 ఫిబ్రవరి 12న జయప్రకాశ్ తో కావాలనే ఘర్షణ పెట్టుకుని ఫ్యాన్ మోటారుతో తలపై కొట్టి హత్య చేసానని తరువాత థర్డ్ ఫ్లోర్ బాల్కనీలో ఓ పెద్ద పూటకుండీలాంటి తొట్టెలో పూడ్చేశానని తెలిపాడు. అదేరోజు పోలీసుస్టేషన్‌కు వెళ్లి జయప్రకాశ్ మిస్ అయ్యాడని ఫిర్యాదు చేసి..ఇంటి యజమానికీ ఇదే విషయం చెప్పి..కొన్నిరోజులకు హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఇక్కడే వుండిపోయానని పోలీసులు విచారణలో విజయ్ తెలిపాడు. దీంతో పోలీసులు విజయ్ పై హత్య కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించారు.