LPG cylinder: బాదుడే బాదుడు.. రూ. 25 పెరిగిన వంట గ్యాస్ ధరలు
పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి.

Gas
LPG cylinder: పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. సబ్సిడీయేతర సిలిండర్ ధర లేటెస్ట్‌గా మరోసారి రూ.25 పెరిగింది. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ. 859.5 అయ్యింది. అంతకుముందు దీని ధర రూ.834.50గా ఉండేది. గతంలో జూలై 1వ తేదీన, LPG సిలిండర్ ధర రూ.25.50 పెరిగింది.
ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ.859.5 కాగా, ఇప్పటి వరకు రూ .834.50గా ఉంది. కోల్‌కతాలో, LPG సిలిండర్ ధర రూ .861 నుండి రూ. 886 కి పెరిగింది. ఈ రోజు నుంచి చెన్నైలో LPG సిలిండర్ ధర రూ. 875.50 కానుంది. ఇది నిన్నటి వరకు రూ. 850.50గా ఉండేది.
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో LPG సిలిండర్ ధర రూ .897.5 అయ్యింది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో LPG సిలిండర్ కోసం రూ. 866.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్‌లో రూ.887గా ఉన్న గ్యాస్ ధరలు 25రూపాయలు పెరిగి రూ.912కి పెరిగింది.
సాధారణంగా, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున గ్యాస్ సిలిండర్ల (LPG ధర) ధరను మారుస్తాయి. 2021 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో, ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .694, ఇది ఫిబ్రవరిలో సిలిండర్‌కు రూ .719 కి పెరిగింది. ఫిబ్రవరి 15న మళ్ళీ ధర రూ.769పెరిగింది. ఫిబ్రవరి 25న రూ 794కు పెరిగింది. మార్చిలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ 819కు పెరిగింది. తరువాత ఏప్రిల్ ప్రారంభంలో రూ .10 తగ్గి రూ.809 కి వచ్చింది. ఒక సంవత్సరంలో, LPG సిలిండర్ల ధరలు రూ.165.50 పెరిగాయి.