ఆరేళ్ల బాలికపై అత్యాచారం

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 06:03 AM IST
ఆరేళ్ల బాలికపై అత్యాచారం

Updated On : April 28, 2020 / 6:03 AM IST

ఓవైపు ప్రపంచం అంతా కరోనా భయంతో వణికిపోతుంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సభ్య సమాజం భయపడే ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో తన ఇంటి సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.

ఈ ఘటనలో బాలిక కళ్ళ నుంచి గుడ్లు కూడా బయటకు వచ్చాయి. చిన్నారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. బాలిక తన ఇంటికి దగ్గరగా స్నేహితులతో కలిసి ఆడుతుండగా ఆమెను గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని వెళ్లాడు.

ఆమె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రయత్నించగా.. ఉదయం బాలిక ఒక చోట పడిపోయి కనిపించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లుగా గుర్తించారు. ఆమె కళ్ళపై బలమైన గాయాలు ఉన్నట్లుగా సీనియర్ పోలీసు అధికారి హేమంత్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.