Viral Video: డ్రైనేజీలోకి దిగి.. క్లీన్ చేసిన బీజేపీ నేత

ఆయన డ్రైనేజీలోకి దిగి శుభ్రం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న నగరపాలక సంస్థ సిబ్బంది అప్పుడు స్పందించి..

Viral Video: డ్రైనేజీలోకి దిగి.. క్లీన్ చేసిన బీజేపీ నేత

BJP councilor Devendra Rathore

Updated On : April 3, 2024 / 8:07 PM IST

డ్రైనేజీలోకి దిగి.. దాన్ని క్లీన్ చేశారు ఓ బీజేపీ నేత. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మురుగు కాలువ నిండిపోయిందని, దాన్ని శుభ్రం చేయకపోవడంతో వాసన వస్తోందని, నీళ్లు వెళ్లడం లేదని గ్వాలియర్‌లోని వార్డు-15 బీజేపీ కౌన్సిలర్ దేవేంద్ర రాథోడ్ అనేకసార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో తానే స్వయంగా డ్రైనేజీలోకి దిగి శుభ్రం చేశానని దేవేంద్ర తెలిపారు.

మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోలేదని అందుకే తానే పని చేస్తున్నానని అన్నారు. బిర్లానగర్‌లోని డ్రైనేజీని శుభ్రం చేశానని చెప్పారు. ఆయన డ్రైనేజీలోకి దిగి శుభ్రం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న నగరపాలక సంస్థ సిబ్బంది అప్పుడు స్పందించి వెంటనే అక్కడకు చేరుకుని శుభ్రం చేశారు.

వార్డ్ నంబర్ 15లో మురుగు కాలువ సమస్య చాలా కాలంగా ఉందని, ఇళ్లలోకి మురికి నీరు ప్రవహిస్తోందని స్థానికులు చెప్పారు. కమిషనర్‌, మేయర్‌ను కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు కదలలేదని అన్నారు.


Also Read: సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలో పేలిన రియాక్టర్.. ఆరుగురి మృతి.. పలువురికి గాయాలు