Madhya Pradesh polls : అసెంబ్లీ ఎన్నికల్లో బావామరదళ్ల మధ్య పోరు..భార్య విజయం కోసం ఏనుగును ప్రార్థిస్తున్న భర్త

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బావా మరదళ్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ పక్షాన సిట్టింగ్ ఎమ్మెల్యే శైలేంద్ర జైన్ బరిలో నిలిచారు....

Madhya Pradesh polls : అసెంబ్లీ ఎన్నికల్లో బావామరదళ్ల మధ్య పోరు..భార్య విజయం కోసం ఏనుగును ప్రార్థిస్తున్న భర్త

BJP MLA Shailendra Jain,Nidhi Jain

Updated On : October 29, 2023 / 11:07 AM IST

Madhya Pradesh polls : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బావా మరదళ్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ పక్షాన సిట్టింగ్ ఎమ్మెల్యే శైలేంద్ర జైన్ బరిలో నిలిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున స్వయానా తన తమ్ముడి భార్య (మరదలు) అయిన నిధి జైన్ ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో స్వయంగా మరదలైన నిధితో బావ శైలేంద్ర ఎన్నికల్లో తలపడుతున్నారు.

Also Read : Hamas : గాజా ఆసుపత్రిలో హమాస్ ఉగ్రవాదుల పాగా…వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

నిధి జైన్ భర్త సునీల్ జైన్ తన భార్య విజయం కోసం ఏనుగును సైతం ప్రార్థించారు. గతేడాది జరిగిన పౌర ఎన్నికల సందర్భంగా జైన్ సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్లో కాంగ్రెస్ తరపున నిధి జైన్ మేయర్ రేసులో నిలిచారు. బీజేపీకి చెందిన సంగీతా సుశీల్ తివారీ చేతిలో నిధిజైన్ ఓడిపోయారు. ఈ ఓటమి సోదరుల మధ్య విభేదాలకు దారితీసింది.

Also Read :  Hero Bus Driver : గుండెపోటు వచ్చినా 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్

బీజేపీ ఎమ్మెల్యే అయిన తన సొంత బావ శైలేంద్ర ఉండగా మరదలు నిధి జైన్ ఓటమి పాలయ్యారు. దీంతో ఈ విబేధాలు రాబోయే ఎన్నికల షోడౌన్‌కు వేదికగా నిలిచాయి. రాబోయే ఎన్నికల్లో తన భార్య విజయం కోసం సునీల్ జైన్ ఏనుగును ప్రార్థిస్తూ ఇటీవల కనిపించారు.

Also Read :  Goa Athletes : గోవాలో తక్కువ ధరకే లభిస్తుందని మద్యం తాగొద్దు…అథ్లెట్లకు మంత్రి సలహా

సాగర్ నియోజకవర్గంలో పట్టి పీడిస్తున్న అభివృద్ధి పేదరికాన్ని పారదోలేందుకు తన సతీమణి గెలుపు దోహదపడుతుందని స్వయంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ జైన్ అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 17వతేదీన జరగనుండగా ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. మొత్తంమీద మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బావామరదళ్ల మధ్య నెలకొన్న పోరు ఆసక్తికరంగా మారింది.