Mohan Yadav : బీజేపీ సంచలన నిర్ణయం.. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్

సీఎం పదవి కోసం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ రాష్ట్ర చీఫ్ శర్మ, కైలాశ్ వర్గియా, జ్యోతిరాదిత్య సింథియా పోటీ పడ్డారు.

Mohan Yadav : బీజేపీ సంచలన నిర్ణయం.. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్

Madhya Pradesh New CM Mohan Yadav

మధ్యప్రదేశ్ కొత్త సీఎం ఎవరు? అన్నదానిపై వారం రోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. దక్షిణ ఉజ్జయిని నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. సీఎం పదవి కోసం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ రాష్ట్ర చీఫ్ శర్మ, కైలాశ్ వర్గియా, జ్యోతిరాదిత్య సింథియా పోటీ పడ్డారు. చివరికి మోహన్ యాదవ్ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపింది. సీఎంగా మోహన్ యాదవ్ ను ఎంపిక చేయడంతో.. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ శకం ముగిసినట్లు అయ్యింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ని బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎంపిక చేశారు. 163 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో తమ నేతగా మోహన్ యాదవ్ ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఢిల్లీ నుంచి వెళ్లిన పరిశీలకులు సమక్షంలో భోపాల్ లో జరిగిన సమావేశంలో మోహన్ యాదవ్ ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. మోహన్ యాదవ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గుతూ వచ్చారు. దక్షిణ ఉజ్జైన్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వయసు 58ఏళ్లు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నేత.

Also Read : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం

మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి నవంబర్ 17న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి ఎవరు? అన్నది సస్పెన్స్ గా మారింది. కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కూడా రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింథియా సీఎం రేసులో ఉన్నట్లు చర్చ జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ నే కొనసాగిస్తారా? లేక మారుస్తారా? అనే చర్చకు ఇవాళ్టితో తెరపడింది. శివరాజ్ సింగ్ చౌహార్ తదుపరి ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ని లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎంపిక చేశారు.

స్పీకర్ గా నరేంద్ర సింగ్ తోమర్ పని చేయబోతున్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నట్లు సమాచారం. ఇక, క్యాబినెట్ కూర్పునకు సంబంధించి ఢిల్లీలో అధిష్టానం వద్ద చర్చలు జరగబోతున్నాయి.

Also Read : అయ్యప్ప మాలదారులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్