Earthquake : జమ్మూకశ్మీరులో మళ్లీ భూకంపం…వరుస భూకంపాలతో భయాందోళనలు

Earthquake
Earthquake : దేశంలోని జమ్మూకశ్మీరులో శనివారం మళ్లీ భూకంపం సంభవించింది. దేశంలో జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. జమ్మూకశ్మీరులోని గుల్ మార్గ్ వద్ద శనివారం ఉదయం 8.36 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. (National Center for Seismology)
HIV positive : యూపీ ఆసుపత్రిలో 16 నెలల్లో 81 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ…విచారణకు ఆదేశం
గుల్ మార్గ్ కు 184 కిలోమీటర్ల దూరంలో 129 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. (Earthquake) జమ్మూకశ్మీరులో ఈ ఏడాది ఇప్పటివరకు 12 సార్లు భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ( Earthquake jolts Jammu and Kashmir) గతంలో దోడ జిల్లాలో జులై 10వతేదీన సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9 గా నమోదైంది.
దోడ జిల్లాలో సంభవించిన భూకంపం వల్ల పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇటీవల వరుసగా వారం రోజులపాటు అండమాన్ నికోబార్ దీవులను భూకంపాలు వణికించాయి. ఈ భూకంపాల వల్ల పెద్దగా ఆస్తి నష్టం జరగకున్నా, తరచూ జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల్లో సంభవించిన భూకంపాలతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.