Women Constable: మహిళా పోలీస్ కానిస్టేబుల్ సంపాదన ఆరేళ్లలో రూ.26లక్షలు

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి ఆరేళ్లలో రూ.26లక్షలు సంపాదించింది. కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్...

Women Constable: మహిళా పోలీస్ కానిస్టేబుల్ సంపాదన ఆరేళ్లలో రూ.26లక్షలు

Maharashtra Police

Updated On : September 5, 2021 / 7:10 AM IST

Women Constable: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి ఆరేళ్లలో రూ.26లక్షలు సంపాదించింది. కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్ వాసాయ్ పోలీస్ స్టేషన్లో దొంగల నుంచి రికవరీ చేసిన వస్తువులకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తుంది.

ఓ స్క్రాప్ డీలర్ ను మాట్లాడుకుని ఆమె దగ్గర ఉన్న వస్తువులన్నీ అమ్మేయడం మొదలుపెట్టింది. ఆరేళ్లుగా ఇదే పని. రీసెంట్ గా రికవరీ చేసిన వాహనాలపై ఆడిట్ నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సీనియర్ ఇన్‌స్పెక్టర్ కళ్యాణ్ కార్పె యాక్షన్ తీసుకుంటూ.. గైక్వాడ్ ను సస్పెండ్ చేశారు. ఆమెపై ఎంక్వైరీని పెండింగ్ లో ఉంచారు.