Narayan Rane Bail : కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు బెయిల్ మంజూరు
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు బెయిల్ మంజూరు అయింది. రాయ్‌గఢ్‌లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు అర్ధరాత్రి బెయిల్ మంజూరు చేసింది. నారాయణ్ రాణేకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Narayana Rane (1)
Union Minister Narayan Rane : కేంద్రమంత్రి నారాయణ్ రాణెకు బెయిల్ మంజూరు అయింది. రాయ్‌గఢ్‌లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు అర్ధరాత్రి బెయిల్ మంజూరు చేసింది. నారాయణ్ రాణేకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 13న విచారణ కోసం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నారాయణ్ రాణే కు కోర్టు సూచించింది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై నారాయణ్ రాణె అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నారాయణ్ రాణేను రత్నగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం నిన్న రాత్రి మహాద్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. పోలీసులు 7 రోజుల కస్టడీకి కోరారు.
నారాయణ రాణేను కస్టడీకి తీసుకుని విచారించేంత నేరం చేయలేదని..డయాబెటిస్, బీపీ అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని రాణే తరపు న్యాయవాది కోర్టును కోరారు. సుమారు 9 గంటల పాటు నారాయణ్ రాణే జైల్లో ఉన్నారు. అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది.
నారాయణ్ రాణే పై ఉన్న మరో 4 ఎఫ్ఐఆర్ లు..వాటి విషయంలో మరోసారి రాణేను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మహాద్, పూణే, జల్గావ్, థానే, నాసిక్ లో రాణేపై శివసేన కార్యకర్తలు కేసులు పెట్టారు. రాణేకు మరో కేసులోనూ చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఆయనను మరోసారి అరెస్ట్ చేసేందుకు మహారాష్ట్ర పోలీసులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నాసిక్ పోలీసులు ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు. సెప్టెంబర్ 2న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
రాణే ఎపిసోడ్‌తో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. శివసేన, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాణేకు శివసేన నుంచి ప్రాణహాని ఉందని బీజేపీ ఆరోపిస్తుంటే.. రాణేకు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని శివసేన నేతలు అంటున్నారు. ప్రస్తుతం కొంకన్ ప్రాంతంలో రాణే జన ఆశీర్వాద యాత్ర సాగుతోంది. రేపటి నుంచి జన ఆశీర్వాద యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.