Maharshtra : అమ్మ కోసం బావి తవ్విన బుడ్డోడు .. త‌ల్లి నీటి క‌ష్టాలు తీర్చిన కొడుకుపై ప్ర‌శంస‌లు

కష్టాలు చూసిన ఓ పిల్లాడు అపర భగీరథుడే అయ్యాడు. ఎర్రటి ఎండలో అమ్మ కాళ్లు బొబ్బలెక్కేలా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడుస్తున్న అమ్మను చూసిన 14 ఏళ్ల బాలుడు అమ్మ కోసం భగీరథుడు అవతారం ఎత్తాడు. పలుగు పార పట్టుకున్నాడు.

Maharshtra : అమ్మ కోసం బావి తవ్విన బుడ్డోడు .. త‌ల్లి నీటి క‌ష్టాలు తీర్చిన కొడుకుపై ప్ర‌శంస‌లు

boy digs well to mom

Maharshtra Water crisis : కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి నీటి కోసం అమ్మ పడుతున్న కష్టాలు చూసిన ఓ పిల్లాడు అపర భగీరథుడే అయ్యాడు. ఎర్రటి ఎండలో అమ్మ కాళ్లు బొబ్బలెక్కేలా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడుస్తున్న అమ్మను చూసిన 14 ఏళ్ల బాలుడు అమ్మ కోసం భగీరథుడు అవతారం ఎత్తాడు. పలుగు పార పట్టుకున్నాడు. అమ్మ కోసం ఓ బావి తవ్వేశాడు. భూమిలోంచి పొంగుకొచ్చిన గంగమ్మను చూసి మురిసిపోయాడు. తన తల్లి కష్టాలు తీరిపోయాయని గంతులేశాడు. అమ్మా నీకోసం గంగమ్మే తరలి వచ్చింది చూడమ్మా..అంటూ మురిసి చెబుతున్న కొడుకుని చూసి గుండెలకు హత్తుకుంది ఆ తల్లి. ప్రతీ తల్లికి నీలాంటి కొడుకుంటే ఏ తల్లీ కంటనీరు పెట్టదురా బంగారం అంటూ ముద్దులతో కొడుకును ముంచెత్తిందా తల్లి..తల్లి నీటి కష్టాన్ని తీర్చిన ఆ కొడుకుపై కుటుంబ సభ్యులతో పాటు స్థానికులంతా ప్రశంసించారు.

మహారాష్ట్రలో నీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ప‌డ‌రాని పాట్లు.. గొంతు త‌డుపుకుందామంటే కూడా కిలోమీట‌ర్ల మేర వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటు వెళ్లి నీళ్లు తెస్తున్న త‌ల్లి బాధ‌ను చూడ‌లేక‌పోయాడు మ‌హారాష్ట్ర‌లోని పాల్గ‌ర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల కుర్రాడు ప్ర‌ణ‌వ్. మండుటెండ‌ల్లో తల్లి బిందెల‌తో నీళ్లు తేవ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయాడు. త‌ల్లి ప‌డుతున్న క‌ష్టాన్ని తీర్చాల‌నుకున్నాడు.

 

ప్ర‌ణ‌వ్ 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ప్ర‌ణ‌వ్ త‌ల్లిదండ్రులు ద‌ర్శ‌న‌, వినాయ‌క కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. వారు నివసించే ద‌వంగే ప‌డా ఏరియాలో తీవ్ర నీటి క‌ష్టాలున్నాయి. దీంతో త‌ల్లి ద‌ర్శ‌న ప్ర‌తి రోజు ఓ చెరువు వ‌ద్ద‌కు వెళ్లి నీళ్లు తెచ్చేది. త‌ల్లి క‌ష్టాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోయిన ప్ర‌ణవ్‌.. త‌న‌కు స‌మ‌యం దొరికిన‌ప్పుడల్లా.. ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే ఓ బావిని త‌వ్వాడు. అమ్మకోసం కష్టపడుతున్న ఆ బాలుడి కష్టాన్ని గంగమ్మ కూడా అర్థమైందేమో. భూమిలోంచి ఉబికి వచ్చింది. ఈ నీటిని చూసిన ప్రణవ్ ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మా ఇక నువ్వు కష్టపడక్కర్లేదే..ఎండలో నడిచి వెళ్లక్కర్లేదు ఇది నీళ్లు అంటూ అమ్మకు సంతోషంగా చెబుతున్న కొడుకుని చూసిన ఆ తల్లికి మాటలు రాలేదు. కానీ నా బంగారం అంటూ గుండెలకు హత్తుకుంది. అదిచాలాదా ఆ పిల్లాడికి తను పడిన కష్టాన్ని మర్చిపోవటానికి..ఇక ప్రణవ్ త‌ల్లి ఎప్పుడు చెరువుకు వెళ్ల‌డం లేదు. ఆ బాలుడి కష్టానికి ప్రతిఫలంగా ఆ బావిలో ఊరుతున్న నీరు వారికే కాకుండా ఆ చుట్టుపక్కల వారికి కూడా అవసరాలను తీరుస్తోంది.

 

నువ్వు సల్లంగుండాలి బిడ్డా అంటూ ప్రణవ్ ను ఆశీర్వదిస్తున్నారు స్థానికులు. ఇలాంటి బిడ్డను కన్న నువ్వు చాలా అదృష్టవంతురాలివే తల్లీ అంటూ దర్శనను కూడా అభినందిస్తున్నారు స్థానికులు. తన కొడుకు తన కోసం పడిన కష్టం గురించి దర్శన మాట్లాడుతు..త‌న కుమారుడు బావి త‌వ్వ‌డంతో ఇప్పుడు నీటి కష్టాలు తీరాయి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. త‌న కొడుకును చూస్తుంటే ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని ఆమె ఆనంద‌భాష్పాలు జలాజలా రాలుతుండగా చెప్పింది. ఇక ప్రణవ్ తండ్రి వినాయ‌క్ మాట్లాడుతూ.. ప్ర‌ణ‌వ్ బావి త‌వ్వుతున్న స‌మ‌యంలో తాను కేవ‌లం అడ్డొచ్చిన రాళ్ల‌ను మాత్ర‌మే బ‌య‌ట‌కు తీశాను. మిగ‌తా ప‌నంతా ప్ర‌ణ‌వే చేశాడ‌ు వాళ్లమ్మ కష్టాన్నే కాదు స్థానికుల నీటి కష్టాన్ని కూడా నా కొడుకు తీర్చాడు అంటూ మురిసిపోతు చెప్పాడు. నా కొడుకుని అందరు అభినందిస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటోందని తెలిపాడు. బావిలో నీరు చూసిన‌ప్పుడు త‌న కుమారుడి క‌ష్టం గుర్తొస్తుందని భార్యాభార్తలిద్దరు కొడుకుగురించి గొప్పగా చెప్పారు.